తమన్నా 'కావాలా' సాంగ్ కు చిందులేసిన జపాన్‌ చిన్నోడు... వీడియో వైరల్

తమన్నా భాటియా, రజనీకాంత్ నటించిన 'జైలర్' మూవీ దేశ వ్యాప్తంగా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది.

Update: 2023-08-16 05:46 GMT

దిశ, వెబ్ డెస్క్ : తమన్నా భాటియా, రజనీకాంత్ నటించిన 'జైలర్' మూవీ దేశ వ్యాప్తంగా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. అందులో మిల్కీ బ్యూటీ తమన్నా చేసిన ఐటమ్ సాంగ్ 'కావాలా' దేశ సరిహద్దులు దాటి మారుమోగిపోతోంది. ఇక ఇన్ స్టాగ్రామ్ రిల్స్ లో ఆ పాటకు వయసుతో సంబంధం లేకుండా అందరూ చిందులేస్తూ దుమ్ములేపుతున్నారు. ఈ నేపథ్యంలో కాకేటకు అనే జపాన్ యువకుడు 'కావాలా' సాంగ్ కు స్టెప్పులేసి అదగొట్టాడు. అందుకు సంబంధించిన వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు సూపర్ కొరియోగ్రఫీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు 'అన్ బిలీవబుల్.. అదరగొట్టావ్' అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Full View

Tags:    

Similar News