విడిపోయిన ప్రేమికులకు కోసం రూ.33కోట్ల కేటాయింపు.. ఎందుకో తెలుసా?

గాఢంగా ప్రేమాలో మునిగి తేలి.. కొన్నాళ్లకు విడిపోయి ఒంటరిగా జీవిస్తున్న ప్రేమికులకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ఓ గ్రూపును ఏర్పాటు చేశామని, వారి కోసం రూ.33 కోట్లు వెచ్చించామని న్యూజిలాండ్ ప్రభుత్వం ప్రకటించింది.

Update: 2023-03-25 14:18 GMT

దిశ, వెబ్ డెస్క్: గాఢంగా ప్రేమాలో మునిగి తేలి.. కొన్నాళ్లకు విడిపోయి ఒంటరిగా జీవిస్తున్న ప్రేమికులకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ఓ గ్రూపును ఏర్పాటు చేశామని, వారి కోసం రూ.33 కోట్లు వెచ్చించామని న్యూజిలాండ్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రేమలో పడిన యువతీ యువకులు లవ్ ఫెయిల్యూర్ కారణంగా తప్పదోవ పడుతున్నారు, మరికొందరు ఆత్మహత్యలు, ఇతర అలవాట్లకు బానిసలవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రేమలో విఫలమైన యువతీ యువకులకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు న్యూజిలాండ్ ప్రభుత్వం లవ్ బెటర్ అనే ప్రచార బృందాన్ని సర్కార్ అధికారికంగా ప్రారంభించింది. ఇందుకోసం ప్రభుత్వ బడ్జెట్లో రూ.33 కోట్లు కేటాయించింది. ప్రేమలో విఫలమైన వారు కోలుకునేలా సలహాలు ఇస్తూ.. వారిని బ్రేకప్ బాధ నుంచి బయటపడే విధంగా ఈ బృందం పనిచేస్తుంది. న్యూజిలాండ్ ప్రభుత్వం చేపట్టిన చొరవను ఆ దేశ ప్రజలు స్వాగతిస్తున్నారు.

Tags:    

Similar News