కేవలం 250 రూపాయలతో బోలెడు ప్రయోజనాలు
దిశ, ములుగు : అడవి కాకర కాయ అంటే ఇష్టపడని వారు ఉండరు. రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలని వైద్యులు సూచిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇష్టపడి మరీ కొనుక్కుంటున్నారు. ప్రతి ఏడాది వర్షాకాలంలో మార్కెట్లో వీటి సందడి నెలకొంటుంది. ఏటా ఆగస్టు మాసంలో అటవీ ప్రాంతంలో ఇవి ఎక్కువగా కాస్తాయి. ముళ్ళ పొదలు, గుబురు చెట్లు, బండరాళ్ల మధ్య ఈ మొక్కలు పెరుగుతాయి. తీగ జాతిగా ఎదిగి పంట దిగుబడినిస్తాయి. సహజంగా లభించే ఈ కాకరకాయను […]
దిశ, ములుగు : అడవి కాకర కాయ అంటే ఇష్టపడని వారు ఉండరు. రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలని వైద్యులు సూచిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇష్టపడి మరీ కొనుక్కుంటున్నారు. ప్రతి ఏడాది వర్షాకాలంలో మార్కెట్లో వీటి సందడి నెలకొంటుంది. ఏటా ఆగస్టు మాసంలో అటవీ ప్రాంతంలో ఇవి ఎక్కువగా కాస్తాయి. ముళ్ళ పొదలు, గుబురు చెట్లు, బండరాళ్ల మధ్య ఈ మొక్కలు పెరుగుతాయి. తీగ జాతిగా ఎదిగి పంట దిగుబడినిస్తాయి. సహజంగా లభించే ఈ కాకరకాయను భోజనప్రియులు అమితంగా ఇష్టపడతారు.
ములుగు జిల్లాతో పాటు వివిధ మండలాల్లో అటవీ ప్రాంతాల్లో ఇవి దొరుకుతాయి. వ్యాపారులు, పశువుల కాపరులు వీటిని నగరంలోని ప్రధాన కూడళ్లలో విక్రయిస్తుంటారు. ప్రస్తుతం ఈ కాకరకాయ ధర మార్కెట్లో కిలోకు రూ. 220 నుంచి 250 వరకు పలుకుతున్నది. ధరలు ఎక్కువగా ఉండటంతో మధ్యతరగతి ప్రజలు వీటిని కొనేందుకు వెనకడుగు వేస్తున్నారు. వైద్య నిపుణులు ఈ కాకరకాయలో మంచి ఔషధగుణాలు ఉంటాయని చెబుతారు. బీపీ, షుగర్ వ్యాధిగ్రస్థులకు ఇదో మంచి ఔషధంగా పని చేస్తుంది.