వేకువజామున అమ్మవారిని మేలుకొలిపి.
దిశ, మెదక్: శ్రావణ మాస పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఇవాళ శ్రావణ పౌర్ణమి ముందు వచ్చిన శుక్రవారాన్ని పురస్కరించుకోని ఏడుపాయల వనదుర్గమ్మను వరలక్ష్మీగా విశేష అలంకరణ గావించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా అర్చకులు వేకువ జామున అమ్మవారిని మేలుకొలుపు కార్యక్రమాన్ని జరిపి అనంతరం వేద పండితుల వేద మంత్రోచ్ఛారణల నడుమ పంచామృతాలు, పలు రకాల సుగంధ భరిత ద్రవ్యాలు, పవిత్ర జలాలతో […]
దిశ, మెదక్: శ్రావణ మాస పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఇవాళ శ్రావణ పౌర్ణమి ముందు వచ్చిన శుక్రవారాన్ని పురస్కరించుకోని ఏడుపాయల వనదుర్గమ్మను వరలక్ష్మీగా విశేష అలంకరణ గావించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా అర్చకులు వేకువ జామున అమ్మవారిని మేలుకొలుపు కార్యక్రమాన్ని జరిపి అనంతరం వేద పండితుల వేద మంత్రోచ్ఛారణల నడుమ పంచామృతాలు, పలు రకాల సుగంధ భరిత ద్రవ్యాలు, పవిత్ర జలాలతో శ్రీ సూక్త యుక్తముగా అభిషేకాలను చేశారు.
పట్టు వస్త్రాలు, మంగళకరమైన సౌభాగ్య వస్తువులు, ఎన్నో రకాల పుష్పాలతో అమ్మవారిని సర్వాలంకార భూషితముగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. శ్రీ లలితా సహస్రనామ పారాయణ యుక్తముగా కుంకుమార్చనలను జరిపిన అర్చకులు అమ్మవారికి ప్రీతి పాత్రమైన నైవేద్యాలను నివేదించి కర్పూర హారతులతో మంగళ నీరాజనాలను సమర్పించారు. వన దుర్గామాతను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చే భక్తులకు శానిటైజేషన్, భౌతిక దూరం, మాస్కులు ధరించి వచ్చే విధంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.