కరోనా ఎఫెక్ట్.. ఇంట్లోకి రానివ్వని యజమాని!

దిశ, కోరుట్ల: జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు అతడిని జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. కానీ, అక్కడ బెడ్ లు ఖాళీ లేకపోవడం, మరోపక్క లక్షణాలు అంతగా లేకపోవడంతో బాధితుడిని తిరిగి ఇంటికే పంపించారు. ఇంట్లో ఉండి జాగ్రత్తలు తీసుకుంటూ త్వరగా రికవరీ కావొచ్చని సూచించారు. దీంతో అతడిని తిరిగి అదే అంబులెన్సులో తీసుకొచ్చారు. బాధితుడు అక్కడి చేరుకున్నాక ఇంటి యజమాని తన ఇంట్లో ఉండేందుకు నిరాకరిస్తుండడంతో బాధితుడు అంబులెన్స్ […]

Update: 2020-07-29 04:24 GMT

దిశ, కోరుట్ల: జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు అతడిని జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. కానీ, అక్కడ బెడ్ లు ఖాళీ లేకపోవడం, మరోపక్క లక్షణాలు అంతగా లేకపోవడంతో బాధితుడిని తిరిగి ఇంటికే పంపించారు. ఇంట్లో ఉండి జాగ్రత్తలు తీసుకుంటూ త్వరగా రికవరీ కావొచ్చని సూచించారు.

దీంతో అతడిని తిరిగి అదే అంబులెన్సులో తీసుకొచ్చారు. బాధితుడు అక్కడి చేరుకున్నాక ఇంటి యజమాని తన ఇంట్లో ఉండేందుకు నిరాకరిస్తుండడంతో బాధితుడు అంబులెన్స్ లోనే ఉండిపోయాడు. కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ అతనిలో లక్షణాలు ఏమీ లేనందునే ఇంటికే పంపించామని వెద్యులు తెలిపారు. అయితే పేషెంట్ ప్రత్యామ్నాయంగా మరో ఇంటిని చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడడంతో అతడిని ఎక్కడికి తరలించాలోనన్నది అంతు చిక్కకుండా పరిస్థితి దాపురించింది.

Tags:    

Similar News