రాష్ట్రంలో రోజురోజుకు కరోనా.. ఇవాళ ఎన్నంటే ?

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కరోనా కేసులు మరోసారి భారీగా పెరిగాయి. రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయి. ఏపీ వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 56,155 సాంపుల్స్ పరీక్షించగా 1,186మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,15,302మంది వైరస్‌ బారినపడినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా బారినపడి 10 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మరణించిన వారి […]

Update: 2021-09-01 11:14 GMT

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కరోనా కేసులు మరోసారి భారీగా పెరిగాయి. రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయి. ఏపీ వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 56,155 సాంపుల్స్ పరీక్షించగా 1,186మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,15,302మంది వైరస్‌ బారినపడినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా బారినపడి 10 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 13,867కి చేరింది. అలాగే నిన్న ఒక్కరోజులో1,396 మంది బాధితులు కోలుకోగా.. తాజా గణాంకాలను కలుపుకుని రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,86,962కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,473 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 2,66,85,469సాంపుల్స్‌ను పరీక్షించినట్లు వైద్యఆరోగ్య శాఖ తెలిపింది.

Tags:    

Similar News