సాదా బైనామాల‌కు ఇదే చివ‌రి అవ‌కాశం

దిశ ప్రతినిధి, మెదక్: సాదా బైనామాల క్రమబద్ధీకరణకు ఈ నెల 10 తుది గడువు అని జిల్లా కలెక్టర్ భారతి హోళి కేరి తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ శుక్రవారం ఒక ప్రకటన జారీ చేశారు. సాదా బైనామాలు ఉన్న రైతులు ఈనెల 10 లోగా పట్టా కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పట్టా లేని రైతు ఉండకూడదన్నఉద్దేశ్యంతో సాదా బైనామాల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఆఖరి అవకాశం కల్పించిందనీ కలెక్టర్ తెలిపారు. జిల్లాలో అక్టోబర్5 నుండి […]

Update: 2020-11-06 07:27 GMT

దిశ ప్రతినిధి, మెదక్: సాదా బైనామాల క్రమబద్ధీకరణకు ఈ నెల 10 తుది గడువు అని జిల్లా కలెక్టర్ భారతి హోళి కేరి తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ శుక్రవారం ఒక ప్రకటన జారీ చేశారు. సాదా బైనామాలు ఉన్న రైతులు ఈనెల 10 లోగా పట్టా కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పట్టా లేని రైతు ఉండకూడదన్నఉద్దేశ్యంతో సాదా బైనామాల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఆఖరి అవకాశం కల్పించిందనీ కలెక్టర్ తెలిపారు.

జిల్లాలో అక్టోబర్5 నుండి నవంబర్ 5 వరకు సాదా బైనామాల క్రమబద్ధీకరణకు 24,714 దరఖాస్తులు వచ్చాయన్నారు. సిద్దిపేట డివిజన్ లో 11,475 , గజ్వేల్ డివిజన్ లో 5,309, హుస్నాబాద్ డివిజన్ లో 7,930 దరఖాస్తులు వచ్చాయన్నారు. క్రమ బద్దీకరణ వల్ల సాదా బైనామాతో ఉన్న రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వడం, భూమి పై యాజమాన్య హక్కులు కలగడమే కాకుండా రైతు బంధు, రైతు బీమా , పంట రుణాలు పొందే అవకాశం ఉందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకునేలా గ్రామాల్లో అధికారులు దండోరా వేయించాలన్నారు.

Tags:    

Similar News