వాటి విలువ రూ. లక్షల్లో ఉంటదంట!
దిశ, మహబూబ్ నగర్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పోలీసులు భారీగా నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం పెద్దజెట్రం గ్రామంలో సుమారు రూ.1,13,190 విలువగల నకిలీ విత్తనాలను టాస్క్ ఫోర్స్ బృందం స్వాధీనం చేసుకున్నది. పక్కా సమాచారంతో నారాయణపేట ఎస్పీ డా. చేతన ఆదేశాల మేరకు దాడులు నిర్వహించగా అయిజ తిమ్మారెడ్డి నుంచి 83 ప్యాకెట్లు, 30 కేజీల లూజ్ నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ నిందితుడిని ఉట్కూర్ […]
దిశ, మహబూబ్ నగర్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పోలీసులు భారీగా నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం పెద్దజెట్రం గ్రామంలో సుమారు రూ.1,13,190 విలువగల నకిలీ విత్తనాలను టాస్క్ ఫోర్స్ బృందం స్వాధీనం చేసుకున్నది. పక్కా సమాచారంతో నారాయణపేట ఎస్పీ డా. చేతన ఆదేశాల మేరకు దాడులు నిర్వహించగా అయిజ తిమ్మారెడ్డి నుంచి 83 ప్యాకెట్లు, 30 కేజీల లూజ్ నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ నిందితుడిని ఉట్కూర్ ఎస్సైకి అప్పగించినట్లు వారు తెలిపారు. ఏవో పంచనామా అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. అలాగే మక్తల్ పోలీసులు, వ్యవసాయ అధికారులు దాడులు నిర్వహించి నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ లో కిరణ్ కుమార్ కు చెందిన సాయి విజ్ఞేశ్వర కూల్ డ్రింక్స్ షాపులో నకిలీ విత్తనాలు అమ్ముతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు మక్తల్ ఎస్సై, ఏఓ దాడులు నిర్వహించి 9 క్వింటాళ్ల 45 కేజీల లూజ్ కందులు, 40 కేజీల పెసర్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 1,00,000 వరకు ఉంటుందని వారు తెలిపారు. పంచనామా అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై అశోక్ కుమార్ తెలిపారు.