శ్రీలంక మహిళా జట్టు కోచ్‌గా డిసిల్వా
దిశ, స్పోర్ట్స్: శ్రీలంక మహిళా క్రికెట్ జట్టు జాతీయ తాత్కాలిక కోచ్‌గా మాజీ వికెట్ కీపర్ లంకన్ డిసిల్వా నియామకమయ్యాడు. సరైన ఫలితాలు ఇవ్వలేకపోవడంతో ప్రస్తుత కోచ్ హర్ష డిసిల్వాకు శ్రీలంక క్రికెట్ బోర్డు ఉద్వాసన పలికింది. కొత్తగా పూర్తి స్థాయి కోచ్‌ను నియమించే వరకు లంకన్ డిసిల్వా తాత్కాలిక కోచ్‌గా విధులు నిర్వర్తిస్తాడు. కాగా, శ్రీలంక తరఫున 11 వన్డేలు, మూడు టెస్టులు ఆడిన డిసిల్వా ఈ ఏడాది డిసెంబర్ వరకు పదవిలో ఉంటారని శ్రీలంక […]
దిశ, స్పోర్ట్స్: శ్రీలంక మహిళా క్రికెట్ జట్టు జాతీయ తాత్కాలిక కోచ్‌గా మాజీ వికెట్ కీపర్ లంకన్ డిసిల్వా నియామకమయ్యాడు. సరైన ఫలితాలు ఇవ్వలేకపోవడంతో ప్రస్తుత కోచ్ హర్ష డిసిల్వాకు శ్రీలంక క్రికెట్ బోర్డు ఉద్వాసన పలికింది. కొత్తగా పూర్తి స్థాయి కోచ్‌ను నియమించే వరకు లంకన్ డిసిల్వా తాత్కాలిక కోచ్‌గా విధులు నిర్వర్తిస్తాడు. కాగా, శ్రీలంక తరఫున 11 వన్డేలు, మూడు టెస్టులు ఆడిన డిసిల్వా ఈ ఏడాది డిసెంబర్ వరకు పదవిలో ఉంటారని శ్రీలంక క్రికెట్ సీఈవో ఆష్లే డిసిల్వా తెలిపారు. కాగా, పూర్తి స్థాయి కోచ్ పదవికి కూడా దరఖాస్తు చేసుకోవడానికి లంకన్‌కు అర్హత ఉందని బోర్డు చెప్పింది. లంకన్ డిసిల్వా ఎన్నో ఏండ్లుగా శ్రీలంక క్రికెట్‌తో అనుబంధం కలిగి ఉన్నాడు. గతంలో జాతీయ పురుషుల జట్టుకు కూడా హెడ్ కోచ్‌గా పని చేసిన అనుభవం ఉంది. ఇటీవలే అతను శ్రీలంక అండర్ 19 జట్టుకు సేవలందిస్తున్నాడు. కాగా, హర్షకు ఉన్న రెండేళ్ల కాంట్రాక్టు గడువు ముగిసిపోవడంతో బోర్డు పొడిగించడానికి నిరాకరించింది. హర్ష హయాంలో శ్రీలంక మహిళా జట్టు గత ఏడాది ఆడిన 19మ్యాచులూ ఓడిపోయింది. అలాగే 2020 మహిళా వరల్డ్ టీ20లో నాలుగు మ్యాచ్‌లు ఆడి కేవలం బంగ్లాదేశ్‌పై మాత్రమే గెలిచింది.