లాల్ దర్వాజ బోనాలు.. ఆర్టీవో ప్రత్యేక పూజలు
దిశ, చాంద్రాయణగుట్ట : చారిత్రాత్మక లాల్ దర్వాజ సింహావాహిని అమ్మవారి బోనాల ఉత్సవ వేడుకల్లో రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ ఆర్డీవోగా వ్యవహరించిన చంద్రకళ లాల్ దర్వాజా ఆలయాన్ని సుమారు 1000గజాల్లో విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిన సంగతి తెల్సిందే. అమ్మవారి పూజలకు విచ్చేసిన చంద్రకళ ఆలయ ప్రతినిధులను కలిసి విస్తరణ కార్యక్రమాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బండ్లగూడ ఎమ్మార్ రూపొందించిన విస్తరణ ప్రణాళిక వివరాలపై […]
దిశ, చాంద్రాయణగుట్ట : చారిత్రాత్మక లాల్ దర్వాజ సింహావాహిని అమ్మవారి బోనాల ఉత్సవ వేడుకల్లో రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ ఆర్డీవోగా వ్యవహరించిన చంద్రకళ లాల్ దర్వాజా ఆలయాన్ని సుమారు 1000గజాల్లో విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిన సంగతి తెల్సిందే. అమ్మవారి పూజలకు విచ్చేసిన చంద్రకళ ఆలయ ప్రతినిధులను కలిసి విస్తరణ కార్యక్రమాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బండ్లగూడ ఎమ్మార్ రూపొందించిన విస్తరణ ప్రణాళిక వివరాలపై తానే స్వయంగా ప్రభుత్వానికి విన్నవించి సాధ్యమైనంత త్వరగా ఆలయ విస్తరణ పనులు చేపట్టేందుకు చొరవ తీసుకుంటానని వివరించారు. విస్తరణ పనుల విషయంలో చాలా వ్యూహాత్మకం గా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆర్టీవో సూచించారు. బోనాల ఉత్సవ వేడుకల ప్రత్యేకతను ఆలయ సలహాదారు రంగ రమేష్ గౌడ్ అధికారికి వివరించారు. సింహావాహిని అమ్మవారి పూజ విశేషాలపై ప్రధాన అర్చకులు నరసింహయ్య శర్మ చంద్రకళకు చెప్పడమే కాకుండా ఆశీర్వాదం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ తరఫున ఆర్టీవోను ఘనంగా సన్మానించారు. కరోనా మహమ్మారి ప్రభావం తగ్గాక ఆలయ విస్తరణ పనులకు శ్రీకారం చుట్టడానికి అవసరమైన ఏర్పాట్లు చేయిస్తానని చంద్రకళ ఆలయ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆలయ సలహాదారు రంగ రమేష్ గౌడ్ మణికంఠ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.