18 శక్తి పీఠాలకు బంగారుబోనం
దిశ, చార్మినార్: చారిత్రాత్మక లాల్‌దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం 113వ వార్షికోత్సవాలలో భాగంగా భారతదేశ వ్యాప్తంగా 18 శక్తి పీఠాలకు బంగారు బోనం సమర్పించనున్నట్లు ఆలయకమిటీ చైర్మన్ వెంకటేష్, ప్రధానకార్యదర్శి మారుతి యాదవ్, కోశాధికారి అరవింద్‌కుమార్‌గౌడ్ లు వెల్లడించారు. లాల్‌దర్వాజా దేవాలయ కమిటీ ఆవరణలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. లాల్‌దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఆషాడమాసం బోనాల ఉత్సవాల నుండి దేశవ్యాప్తంగా ఉన్న 18 శక్తి […]
దిశ, చార్మినార్: చారిత్రాత్మక లాల్‌దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం 113వ వార్షికోత్సవాలలో భాగంగా భారతదేశ వ్యాప్తంగా 18 శక్తి పీఠాలకు బంగారు బోనం సమర్పించనున్నట్లు ఆలయకమిటీ చైర్మన్ వెంకటేష్, ప్రధానకార్యదర్శి మారుతి యాదవ్, కోశాధికారి అరవింద్‌కుమార్‌గౌడ్ లు వెల్లడించారు. లాల్‌దర్వాజా దేవాలయ కమిటీ ఆవరణలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. లాల్‌దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఆషాడమాసం బోనాల ఉత్సవాల నుండి దేశవ్యాప్తంగా ఉన్న 18 శక్తి పీఠాలకు బంగారు బోనం సమర్పించనున్నారని తెలిపారు.
మొట్ట మొదటగా ఈ ఆషాడ మాసంలో శ్రీశైలం భ్రమరాంబిక అమ్మవారికి బంగారు బోనం సమర్పించనున్నట్లు చెప్పారు. 18 సంవత్సరాల పాటు ఒక్కో సంవత్సరం ఒక్కో శక్తి పీఠంలో అమ్మవారికి బంగారు బోనం సమర్పించనున్నట్లు ఆలయ కమిటీ పేర్కొంది.