ఎల్వీబీ అన్ని సేవలు యథాతథం : డీబీఎస్!

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల విలీనం అయిన లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఖాతాదారులు అన్ని బ్యాంకింగ్ సేవలను సాధారణంగానే కొనసాగించవచ్చని, సేవింగ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను ఇప్పటివరకైతే మారలేదని డీబీఎస్ బ్యాంక్ ఇండియా సోమవారం వెల్లడించింది. లక్ష్మీ విలాస్ బ్యాంక్(ఎల్వీబీ)ని డీబీఎస్ గ్రూప్ ఇండియా లిమిటెడ్(డీబీఐఎల్)లో విలీనం చేసినట్టు డీబీఎస్ గ్రూప్ హోల్డింగ్స్ లిమిటెడ్ యాజమాన్యంలోని డీబీఎస్ బ్యాంక్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. నవంబర్ 27న ఎల్వీబీని డీబీఎస్ బ్యాంక్ ఇండియాలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించిన […]

Update: 2020-11-30 05:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల విలీనం అయిన లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఖాతాదారులు అన్ని బ్యాంకింగ్ సేవలను సాధారణంగానే కొనసాగించవచ్చని, సేవింగ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను ఇప్పటివరకైతే మారలేదని డీబీఎస్ బ్యాంక్ ఇండియా సోమవారం వెల్లడించింది. లక్ష్మీ విలాస్ బ్యాంక్(ఎల్వీబీ)ని డీబీఎస్ గ్రూప్ ఇండియా లిమిటెడ్(డీబీఐఎల్)లో విలీనం చేసినట్టు డీబీఎస్ గ్రూప్ హోల్డింగ్స్ లిమిటెడ్ యాజమాన్యంలోని డీబీఎస్ బ్యాంక్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది.

నవంబర్ 27న ఎల్వీబీని డీబీఎస్ బ్యాంక్ ఇండియాలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విలీనం తర్వాత ఎల్వీబీ డిపాజిటర్లు, కస్టమర్లు, ఉద్యోగులకు స్థిరమైన, మెరుగైన అవకాశాలను అందిస్తుంది. ఎల్వీబీపై విధించిన మారటోరియం నవంబర్ 27న ఎత్తేశారు. అన్ని బ్యాంకు శాఖలు, డిజిటల్ లావాదేవీలు, ఏటీఎంలు యథావిధిగా పనిచేసేందుకు బ్యాంకింగ్ సేవలను వెంటనే పునరుద్ధరించారని డీబీఎస్ గ్రూప్ ఇండియా పేర్కొంది.

ఎల్వీబీ కస్టమర్లు అన్ని బ్యాంకింగ్ సేవాలను వినియోగించవచ్చు. సేవింగ్స్ బ్యాంకు అకౌంట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు, ఎల్వీబీ అందించే రేట్లనే కొనసాగించనున్నట్టు డీబీఐఎల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్రోజిత్ షోమ్ చెప్పారు. ఎల్వీబీ ఉద్యోగులను తీసివేసే ప్రసక్తి లేదు. అందరూ కొనసాగుతారు. అయితే, ఎల్వీబీ ఉద్యోగులుగా ఉన్నవారు డీబీఐఎల్ ఉద్యోగులుగా మారతారని తెలిపింది. రానున్న నెలల్లో ఎల్వీబీ వ్యవస్థ, నెట్‌వర్క్‌ను డీబీఎస్‌లో అనుసంధానం చేసేందుకు తమ బృందం ఎల్వీబీ అధికారులతో పనిచేస్తుందని డీబీఎస్ భారత విభాగం పేర్కొంది.

Tags:    

Similar News