పార్టీ మార్పుపై అసలు విషయం చెప్పిన ఎల్.రమణ

దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ పార్టీలో అందరితో కలిసి పనిచేస్తానని ఎల్.రమణ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న అనంతరం మినిస్టర్‌ క్వార్టర్స్‌లో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌తో పాటు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు విద్యాసాగర్ రావు, డాక్టర్ సంజయ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గతంలోనే కలిసిరావాలని కోరినప్పుడు సమయానుకూలంగా వస్తానని తెలిపానని.. అందుకే ప్రస్తుతం టీఆర్ఎస్‌లో చేరుతున్నానన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, […]

Update: 2021-07-12 07:59 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ పార్టీలో అందరితో కలిసి పనిచేస్తానని ఎల్.రమణ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న అనంతరం మినిస్టర్‌ క్వార్టర్స్‌లో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌తో పాటు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు విద్యాసాగర్ రావు, డాక్టర్ సంజయ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గతంలోనే కలిసిరావాలని కోరినప్పుడు సమయానుకూలంగా వస్తానని తెలిపానని.. అందుకే ప్రస్తుతం టీఆర్ఎస్‌లో చేరుతున్నానన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సమాజ అభివృద్ధి, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా సాగుతున్న కేసీఆర్ నాయకత్వంలో కలిసి నడిచేందుకే టీఆర్ఎస్‌లో చేరినట్లు ప్రకటించారు.

Tags:    

Similar News