తెలుగు యువకుల ఆకలికేకలు
దిశ, వెబ్ డెస్క్ : బతుకు దెరువు కోసం విదేశాలకు వెళ్లిన తెలుగు యువకులు ఆకలితో అలమటిస్తున్నారు. కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు సైతం నష్టాలు చవిచూడటంతో యాజమాన్యాలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఈ క్రమంలోనే కువైట్‌లో పని చేసేందుకు వెళ్లిన తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం పాశర్ల పూడి యువకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనా కష్టకాలంలో ఉన్న పని కూడా పోవడం.. యజమానులు జీతాలు చెల్లించకపోవడంతో తినడానికి […]
దిశ, వెబ్ డెస్క్ :
బతుకు దెరువు కోసం విదేశాలకు వెళ్లిన తెలుగు యువకులు ఆకలితో అలమటిస్తున్నారు. కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు సైతం నష్టాలు చవిచూడటంతో యాజమాన్యాలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఈ క్రమంలోనే కువైట్‌లో పని చేసేందుకు వెళ్లిన తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం పాశర్ల పూడి యువకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కరోనా కష్టకాలంలో ఉన్న పని కూడా పోవడం.. యజమానులు జీతాలు చెల్లించకపోవడంతో తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తున్నారు. ఈ విషయాన్ని తమ కుటుంబీకులతో పంచుకున్నారు. దీంతో బాధితుల తల్లిండ్రులు తమ పిల్లలను ఇండియాకు తీసుకొచ్చేలా చొరవ చూపాలని మీడియా ద్వారా సీఎం జగన్‌ను వేడుకుంటున్నారు.