ఆర్.కృష్ణయ్యకు మతిభ్రమించింది.. కేయూ లీడర్ ఆగ్రహం
దిశ, కాళోజీ జంక్షన్: రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీలను అనగదొక్కుతున్నాడని విమర్శించిన ఆర్.కృష్ణయ్య, బీసీబంధు ఇవ్వని కేసీఆర్‌కు హుజురాబాద్‌లో పరోక్షంగా మద్దతివ్వడం సిగ్గుమాలిన చర్య అని కేయూ జాక్ చైర్మన్ తిరుపతి యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేయూలో శనివారం తిరుపతి మీడియాతో మాట్లాడుతూ.. వెయ్యిమంది ఫీల్డ్ అసిస్టెంట్లతో హుజురాబాద్‌లో నామినేషన్లు వేయిస్తానని చెప్పిన ఆర్.కృష్ణయ్య ఎక్కడ జపం చేస్తున్నాడని దుయ్యబట్టారు. తెలంగాణాలో బీసీ వాదాన్ని అడ్డం పెట్టుకొని అందినకాడికి దోచుకోవడం, దాచుకోవడం తప్ప, బీసీల కోసం […]
దిశ, కాళోజీ జంక్షన్: రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీలను అనగదొక్కుతున్నాడని విమర్శించిన ఆర్.కృష్ణయ్య, బీసీబంధు ఇవ్వని కేసీఆర్‌కు హుజురాబాద్‌లో పరోక్షంగా మద్దతివ్వడం సిగ్గుమాలిన చర్య అని కేయూ జాక్ చైర్మన్ తిరుపతి యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేయూలో శనివారం తిరుపతి మీడియాతో మాట్లాడుతూ.. వెయ్యిమంది ఫీల్డ్ అసిస్టెంట్లతో హుజురాబాద్‌లో నామినేషన్లు వేయిస్తానని చెప్పిన ఆర్.కృష్ణయ్య ఎక్కడ జపం చేస్తున్నాడని దుయ్యబట్టారు. తెలంగాణాలో బీసీ వాదాన్ని అడ్డం పెట్టుకొని అందినకాడికి దోచుకోవడం, దాచుకోవడం తప్ప, బీసీల కోసం ఆయన చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అరాచక పాలనలో రాష్ట్రంలో బీసీలకు ఆత్మగౌరవం లేదన్న కృష్ణయ్య టీఆర్ఎస్‌కు పరోక్ష మద్దతు వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. బీసీ కమిషన్ చైర్మన్ పదవి కోసం కేసీఆర్‌తో కుమ్మక్కైయ్యాడని ఆరోపించారు. దీనిని బీసీ సమాజం మొత్తం గమనిస్తోందని అన్నారు. బీసీ బంధు ఇవ్వని టీఆర్ఎస్‌కు హుజురాబాద్‌లో తగిన గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు.