మట్టి వినాయక విగ్రహాలను ఆవిష్కరించిన కేటీఆర్

దిశ, న్యూస్‌బ్యూరో: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) పరిధిలోని 32కేంద్రాల్లో 50వేల మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వినాయక చవితిని పురస్కరించుకుని ఈ ఏడాది 8 ఇంచుల ఎత్తున్న 50వేల పర్యావరణహిత వినాయక(మట్టి) విగ్రహాలు పంపిణీ చేయనున్నది. శుక్రవారం అథారిటీ ఉచితంగా పంపిణీ చేయనున్న వినాయక విగ్రహాలను ఆవిష్కరించిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రజలు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలను పూజించాలని […]

Update: 2020-08-14 08:59 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) పరిధిలోని 32కేంద్రాల్లో 50వేల మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వినాయక చవితిని పురస్కరించుకుని ఈ ఏడాది 8 ఇంచుల ఎత్తున్న 50వేల పర్యావరణహిత వినాయక(మట్టి) విగ్రహాలు పంపిణీ చేయనున్నది. శుక్రవారం అథారిటీ ఉచితంగా పంపిణీ చేయనున్న వినాయక విగ్రహాలను ఆవిష్కరించిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రజలు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలను పూజించాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News