రుణమాఫీకి ప్రభుత్వం కట్టుబడి ఉంది : కేటీఆర్

దిశ, తెలంగాణ బ్యూరో: వ్యవసాయ రుణాల మాఫీకి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రైతులను రుణ విముక్తి చేయడం కోసం ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తోందన్నారు. 2014లో లక్ష రూపాయల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. అందులో భాగంగానే 35.19 లక్షల రైతులకు 16144.10 కోట్ల రూపాయలు మాఫీ చేసినట్లు తెలిపారు. 2018లో ఇచ్చిన హామీ మేరకు రైతుల సంక్షేమం కోసం నిబద్ధతతో పని చేస్తున్నామని […]

Update: 2021-08-21 01:22 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: వ్యవసాయ రుణాల మాఫీకి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రైతులను రుణ విముక్తి చేయడం కోసం ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తోందన్నారు. 2014లో లక్ష రూపాయల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. అందులో భాగంగానే 35.19 లక్షల రైతులకు 16144.10 కోట్ల రూపాయలు మాఫీ చేసినట్లు తెలిపారు. 2018లో ఇచ్చిన హామీ మేరకు రైతుల సంక్షేమం కోసం నిబద్ధతతో పని చేస్తున్నామని వెల్లడించారు. కరోనా సమయంలో కూడా 50000 లోపు రుణాలు ఉన్న 9 లక్షల రైతులకు రుణమాఫీ చేస్తున్నామన్నారు. రైతుల కోసం నిబద్ధతతో పని చేస్తున్న సీఎం కేసీఆర్‌కు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.

Tags:    

Similar News