జర్మనీ పెట్టుబడిదారులకు ఆహ్వానం.. మౌలిక వసతులపై కేటీఆర్ కామెంట్స్
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో పెట్టుబడులకు జర్మనీ పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నట్లు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సోమవారం తాజ్ కృష్ణాలో జర్మన్ ఇన్వెస్టర్ సమ్మిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు రెండు వేల ఎకరాలు అందుబాటులో ఉందని తెలిపారు. రాష్ట్రంలో అపారమైన అవకాశాలున్నాయన్నారు. తెలంగాణలో ఉన్న అవకాశాలను ప్రభుత్వ విధానాలను పరిశీలించాలని కోరారు. ఏడున్నర ఏళ్లలో సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని, పరిశ్రమల […]
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో పెట్టుబడులకు జర్మనీ పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నట్లు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సోమవారం తాజ్ కృష్ణాలో జర్మన్ ఇన్వెస్టర్ సమ్మిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు రెండు వేల ఎకరాలు అందుబాటులో ఉందని తెలిపారు. రాష్ట్రంలో అపారమైన అవకాశాలున్నాయన్నారు. తెలంగాణలో ఉన్న అవకాశాలను ప్రభుత్వ విధానాలను పరిశీలించాలని కోరారు. ఏడున్నర ఏళ్లలో సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని, పరిశ్రమల స్థాపనకు ప్రోత్సహిస్తున్నారని వెల్లడించారు. ఎన్నో కార్యక్రమాలను చేపట్టాలని వెల్లడించారు.
ప్రాధాన్యత క్రమంలో సమస్యలను పరిష్కరిస్తామని, తొలి ప్రాధాన్యతగా విద్యుత్ సమస్యను పరిష్కరించినట్లు వెల్లడించారు. పరిశ్రమలకు కావలసిన మౌలిక వసతులు కల్పిస్తున్నామని వెల్లడించారు. అమెరికాలో కూడా సింగిల్ విండో విధానం లేదని, తెలంగాణలో మొట్టమొదటిసారిగా ts-ipass ద్వారా సింగిల్ విండో పాలసీని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే 15 రోజుల్లో పరిశ్రమలకు అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించారు. 15 రోజులు అనుమతి ఇవ్వకుంటే 16వ రోజు ఆటోమేటిక్‌గా అప్రూవల్ అయినట్లేనని తెలిపారు. జీడీపీ అభివృద్ధిలో చిన్న పరిశ్రమలు కీలకపాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఈ సమ్మిట్‌లో జర్మన్ రాయబారి వాల్టర్, పారిశ్రామికవేత్తలు అమిత్ దేశాయ్, కృష్ణస్వామి, శశిధర్ రెడ్డి, మోహన్ రెడ్డి, హెన్రీ తదితరులు పాల్గొన్నారు.