నేడు కార్పొరేటర్లతో కేటీఆర్ భేటీ
దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా తదుపరి కార్యాచరణపై దృష్టి సారించింది. ఎక్స్‌అఫిషియో ఓట్లు పెద్ద సంఖ్యలో ఉన్నా.. మరొకరి సాయం తీసుకోకుండా మేయర్ పీఠం ఎక్కలేని పరిస్థితుల్లో టీఆర్ఎస్ ఉండటంతో పార్టీలో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు కార్పొరేటర్లతో […]
దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా తదుపరి కార్యాచరణపై దృష్టి సారించింది. ఎక్స్‌అఫిషియో ఓట్లు పెద్ద సంఖ్యలో ఉన్నా.. మరొకరి సాయం తీసుకోకుండా మేయర్ పీఠం ఎక్కలేని పరిస్థితుల్లో టీఆర్ఎస్ ఉండటంతో పార్టీలో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు కార్పొరేటర్లతో పాటు.. గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో గ్రేటర్ ఫలితాలపై సమీక్ష నిర్వహించి, పొత్తుపై ఓ నిర్ణయానికి వస్తారనే చర్చ సాగుతోంది. మరి ఈ భేటీలో ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.