తప్పేముంది.. మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలను సమర్థించిన కేటీఆర్

దిశ, వెబ్‌డెస్క్: భూ ఆరోపణల నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పార్టీల నుంచి మల్లారెడ్డిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యతగల మంత్రి పదవిలో ఉండి, ఇలా మాట్లాడటం ఏంటని అందరు ముక్కున వేలేసుకుంటున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. శుక్రవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి మల్లారెడ్డికి జోష్, కోపం ఎక్కువ అని ఆవేశంలో మాట్లాడారని […]

Update: 2021-08-27 05:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: భూ ఆరోపణల నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పార్టీల నుంచి మల్లారెడ్డిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యతగల మంత్రి పదవిలో ఉండి, ఇలా మాట్లాడటం ఏంటని అందరు ముక్కున వేలేసుకుంటున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. శుక్రవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి మల్లారెడ్డికి జోష్, కోపం ఎక్కువ అని ఆవేశంలో మాట్లాడారని మల్లారెడ్డి వ్యాఖ్యలను సమర్థించారు. టీఆర్ఎస్‌ పార్టీపై ఎవడెవడో.. ఏదేదో మాట్లాడుతున్నారని, ప్రతి దానికి ఒక హద్దు ఉంటుందని.. దేనికైనా కొంత వరకే ఓపిక ఉంటుందన్నారు. అందుకే తమ వాళ్లు కూడా తిరిగి మాట్లాడతున్నారని వెనకేసుకొచ్చారు.

రాష్ట్రంలో ప్రజలు ఏ బాధ లేకుండా.. సుభిక్షంగా ఉన్నప్పుడు రాజకీయాలు చేయడం ఎందుకని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ‘జన సంగ్రామ యాత్ర’ దేనికోసం చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో హైదరాబాద్ నగరం మొత్తం వరదలతో అతలాకుతలం అయిందని, వరదలు వచ్చిన సమయంలో మిగతా రాష్ట్రాలకు నిధులు ఇచ్చిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణకు మొండి చేయి చూపించిందని గుర్తుచేశారు. అయినా, సిగ్గు లేకుండా తెలంగాణ బీజేపీ నేతలు ‘జన సంగ్రామ యాత్ర’ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇకనైన బుద్ధి తెచ్చుకొని తెలంగాణ ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలని అన్నారు.

Tags:    

Similar News