వరల్డ్ ఎకనామిక్ ఫోరం-2022 వార్షిక సమావేశానికి కేటీఆర్

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రతి ఏటా ప్రతిష్ఠాత్మకంగా దావోస్‌లోని క్లోస్టర్స్ నగరంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశం నిర్వహిస్తున్నారు. 2022 జనవరి 17 నుంచి 22 వరకు జరిగే ఫోరం వార్షిక సమావేశానికి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. ఈ ఆహ్వానాన్ని ఆదివారం వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు బోర్గే బ్రెండే అందజేశారు. తెలంగాణను ఒక ప్రముఖ టెక్నాలజీ పవర్ హౌజ్‌గా మార్చడానికి కేటీఆర్ నాయకత్వం, నిబద్ధత అభినందనీయమన్నారు. కొవిడ్-19 […]

Update: 2021-09-19 06:59 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రతి ఏటా ప్రతిష్ఠాత్మకంగా దావోస్‌లోని క్లోస్టర్స్ నగరంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశం నిర్వహిస్తున్నారు. 2022 జనవరి 17 నుంచి 22 వరకు జరిగే ఫోరం వార్షిక సమావేశానికి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. ఈ ఆహ్వానాన్ని ఆదివారం వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు బోర్గే బ్రెండే అందజేశారు. తెలంగాణను ఒక ప్రముఖ టెక్నాలజీ పవర్ హౌజ్‌గా మార్చడానికి కేటీఆర్ నాయకత్వం, నిబద్ధత అభినందనీయమన్నారు. కొవిడ్-19 నుంచి భారత్ కోలుకునేందుకు స్థిరమైన ఆర్థిక పునరుద్ధరణకు ఆవిష్కరణ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు అనుగుణంగా ఉండే సామర్ధ్యం చాలా అవసరమని పేర్కొన్నారు.

సాధారణ ప్రయోజనాల కోసం అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను ఉపయోగించుకోవడంపై కేటీఆర్ అంతర్ దృష్టిని వార్షిక సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో సహకార మార్గాలను రూపొందించగల సామర్థ్యంపై విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ప్రపంచంలోని అగ్రశ్రేణి రాజకీయ, వ్యాపార, పౌర సమాజ నాయకులు మరోసారి కలిసి రావడం చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు.

మంత్రి కేటీఆర్ వార్షిక సమావేశానికి ఆహ్వానం రావడం సంతోషం వ్యక్తం చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇండస్ట్రీస్, ఇన్నోవేషన్ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ ఆహ్వానాన్ని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ తన స్నేహపూర్వక పారిశ్రామిక విధానాలను ప్రదర్శించడానికి మరియు రాష్ట్రంలో ప్రపంచవ్యాప్త సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి అపారమైన అవకాశాలను ప్రదర్శించడానికి ఇది మరో అవకాశం అన్నారు. ఆహ్వానించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వాహకులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

Tags:    

Similar News