హ్యాపీ బర్త్‌డే ‘మై హ్యాపీనెస్’ : కృతి
దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ఫ్యామిలీకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది. ఏ మాత్రం టైమ్ దొరికినా కుటుంబ సభ్యులతో టైమ్ స్పెండ్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ముఖ్యంగా అమ్మతో గడపడం చాలా ఇష్టమని చెప్పే కృతి.. సిస్టర్ నుపూర్‌తో కలిసి లాక్‌డౌన్‌లో వాళ్ల మమ్మీకి డాన్స్ నేర్పించడం కూడా చూశాం. చిన్నపిల్లలా సనన్ సిస్టర్స్ చెప్పింది ఫాలో అయిపోయి స్టెప్స్ వేసిన అమ్మ(గీతా సనన్) పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్ట్ పెట్టింది కృతి. https://www.instagram.com/p/CGRdcrfg5b-/?igshid=bfaaphnhp67s […]
దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ఫ్యామిలీకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది. ఏ మాత్రం టైమ్ దొరికినా కుటుంబ సభ్యులతో టైమ్ స్పెండ్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ముఖ్యంగా అమ్మతో గడపడం చాలా ఇష్టమని చెప్పే కృతి.. సిస్టర్ నుపూర్‌తో కలిసి లాక్‌డౌన్‌లో వాళ్ల మమ్మీకి డాన్స్ నేర్పించడం కూడా చూశాం. చిన్నపిల్లలా సనన్ సిస్టర్స్ చెప్పింది ఫాలో అయిపోయి స్టెప్స్ వేసిన అమ్మ(గీతా సనన్) పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్ట్ పెట్టింది కృతి.
https://www.instagram.com/p/CGRdcrfg5b-/?igshid=bfaaphnhp67s
లైఫ్‌లో ప్రతీ మూమెంట్‌ను అమేజింగ్ స్మైల్‌తో ఎంజాయ్ చేసే అమ్మ తమకు ఇన్‌స్పిరేషన్ అని చెప్పింది. ‘అమ్మే మా ఇంటి సంతోషం.. అందరి జీవితాల్లో ఆనందం నింపే అమ్మ మా బలం’ అని తెలిపింది. అలాగే ఇంట్లో బేబీ కూడా తనే అన్న కృతి.. లవ్ యూ గీతు(గీతా సనన్) అంటూ బర్త్ డే విషెస్ అందించింది. ఈ సందర్భంగా షేర్ చేసిన పిక్స్‌లో చిన్నప్పటి కృతి అమ్మతో ఇసుకలో ఆడుకుంటూ.. ఇళ్లు కట్టే ఫొటో సూపర్ క్యూట్‌గా ఉంది.
కాగా, ఈ మధ్య కృతి కవిత్వం రాయడం ప్రారంభించిన విషయం తెలిసిందే. లేటెస్ట్ లవ్ అండ్ రొమాంటిక్ ప్రపోజల్ కవితకు నెటిజన్స్ నుంచి మంచి స్పందన కూడా రాగా.. అమ్మపై కవిత రాయాలని కోరుతున్నారు ఫ్యాన్స్.