అమ్మతో సరదాగా..

మన బాల్యంలో ప్రతీ విషయాన్ని అమ్మే నేర్పిస్తుంది. ఎలా తినాలి? ఎలా రాయాలి? ఎలా డ్రెస్ చేసుకోవాలి? ఇలా ప్రతీది అమ్మ నుంచే నేర్చుకుంటాం. అయితే మనం పెద్దయ్యేసరికి అమ్మ చెప్పిన విషయాలే కాక మనం కూడా సరికొత్త విషయాలను నేర్చుకుంటూ ఉంటాం. మరి ఈ విషయాలను అమ్మకు నేర్పిస్తే ఎలా ఉంటుంది? ఎంత ఫన్ వస్తుందనేది? బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ చూపించింది. లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌లు వాయిదాపడి, ఇంట్లోనే ఉంటున్న కృతి తన తల్లికి […]

Update: 2020-06-04 07:02 GMT

మన బాల్యంలో ప్రతీ విషయాన్ని అమ్మే నేర్పిస్తుంది. ఎలా తినాలి? ఎలా రాయాలి? ఎలా డ్రెస్ చేసుకోవాలి? ఇలా ప్రతీది అమ్మ నుంచే నేర్చుకుంటాం. అయితే మనం పెద్దయ్యేసరికి అమ్మ చెప్పిన విషయాలే కాక మనం కూడా సరికొత్త విషయాలను నేర్చుకుంటూ ఉంటాం. మరి ఈ విషయాలను అమ్మకు నేర్పిస్తే ఎలా ఉంటుంది? ఎంత ఫన్ వస్తుందనేది? బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ చూపించింది.

లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌లు వాయిదాపడి, ఇంట్లోనే ఉంటున్న కృతి తన తల్లికి డ్యాన్స్ నేర్పించే ప్రయత్నం చేసింది. కంగనా రనౌత్ నటించిన క్వీన్ సినిమాలోని ‘లండన్ తుమక్డా’ పాటపై స్టెప్స్ వేయించింది. ఈ క్రమంలో ‘హిప్ హాప్’ ఎలా చేయాలో చూపిస్తుండగా ‘అమ్మ మొదట్లో కాస్త ఇబ్బంది పడిన తర్వాత నేర్చుకుందంటూ’ కృతి చెల్లి నుపూర్ సనన్ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘అమ్మకు డ్యాన్స్ నేర్పించే మా పనికిమాలిన ప్రయత్నం మీకు ఆహ్లాదాన్ని అందిస్తుందనే అనుకుంటున్నాం’ అంటున్న కృతి సనన్.. పంజాబీల హిప్‌హాప్ అంత అందంగా ఉండదనే క్యాప్షన్‌తో ఈ వీడియోను అభిమానులతో పంచుకుంది.

https://www.instagram.com/p/CA-kPPegb6L/?utm_source=ig_web_copy_link

Tags:    

Similar News