మరోసారి నా హృదయం ముక్కలైంది : కృతి
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన చివరి చిత్రం దిల్ బెచారా. ఈ చిత్రం రెండు రోజుల క్రితం హాట్‌స్టార్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. సుశాంత్ గౌరవార్థం ఈ సినిమాను అందరూ ఉచితంగా చూసే అవకాశం కల్పించింది హాట్ స్టార్. కాగా ఈ మూవీని చూసిన బాలీవుడ్ సెలెబ్రిటీలు, సుశాంత్ అభిమానులు ఎంతో భావోద్వేగానికి గురవుతున్నారు. సుశాంత్‌ను మిస్ అవుతున్నామంటూ.. కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలోనే సుశాంత్ ఫ్రెండ్ కృతి సనన్ ‘దిల్ బెచారా’ చూసి భావోద్వేగానికి […]
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన చివరి చిత్రం దిల్ బెచారా. ఈ చిత్రం రెండు రోజుల క్రితం హాట్‌స్టార్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. సుశాంత్ గౌరవార్థం ఈ సినిమాను అందరూ ఉచితంగా చూసే అవకాశం కల్పించింది హాట్ స్టార్. కాగా ఈ మూవీని చూసిన బాలీవుడ్ సెలెబ్రిటీలు, సుశాంత్ అభిమానులు ఎంతో భావోద్వేగానికి గురవుతున్నారు. సుశాంత్‌ను మిస్ అవుతున్నామంటూ.. కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలోనే సుశాంత్ ఫ్రెండ్ కృతి సనన్ ‘దిల్ బెచారా’ చూసి భావోద్వేగానికి గురయ్యింది.
‘ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు. నా మనసు మరోసారి విరిగిపోయింది. మ్యానీ పాత్రలో పలు సన్నివేశాల్లో నువ్వు నిజంగా మళ్లీ బతికొచ్చినట్లు అనిపించింది. ఈ పాత్రలో నువ్వు నీలాగా ఫీలయ్యావని నాకు తెలుసు. కొన్ని సన్నివేశాల్లో నువ్వు మౌనంగా ఉన్నప్పటికీ.. ఏం చెప్పలేదని నేననుకోను. ఎందుకంటే.. ఆ మౌనంలోనే నువ్వు ఎన్నో విషయాలను చెబుతావు’ అని కృతి తన మనసులోని భావాలను షేర్ చేసుకుంది. ‘ముఖేష్ చాబ్రా.. నువ్వు ఆలోచించిన దాని కంటే చాలా బాగా తీశావు. నీ మొదటి సినిమాతోనే మమ్మల్ని చాలా భావోద్వేగాలకు గురయ్యేలా చేశావు. సంజనా సంఘి నీకు మంచి భవిష్యత్తుతో పాటు నీ జర్నీ అందంగా ఉండాలి’ అని పేర్కొంది. సుశాంత్ చనిపోయిన తర్వాత కూడా కృతి ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. తన సగం హృదయం సుశాంత్‌తో పాటే వెళ్లిపోయిందని ఆమె అందులో తెలిపింది.
https://www.instagram.com/p/CDGGsKggXs8/