‘అన్నం’తో కృష్ణవంశీ ఎక్స్‌పరిమెంట్

దిశ, సినిమా : క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ‘మహాశివరాత్రి’ పర్వదినం సందర్భంగా ప్రకటించిన కొత్త సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ ఆసక్తి రేపుతోంది. ఎప్పుడూ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా ప్రయత్నించే కృష్ణవంశీ.. ఈసారి కూడా తనదైన మార్క్‌తో న్యూ మూవీ పోస్టర్ రిలీజ్ చేశాడు. ‘అన్నం’ టైటిల్.. ‘పరబ్రహ్మ స్వరూపం’ అనే క్యాప్షన్‌తో అనౌన్స్‌ చేసిన ఈ చిత్రం ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. అరిటాకులో అన్నం, రక్తపు మరకలు, కొడవలి, తాళి బొట్టు అన్నీ కలిపి ఉన్న […]

Update: 2021-03-11 04:37 GMT

దిశ, సినిమా : క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ‘మహాశివరాత్రి’ పర్వదినం సందర్భంగా ప్రకటించిన కొత్త సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ ఆసక్తి రేపుతోంది. ఎప్పుడూ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా ప్రయత్నించే కృష్ణవంశీ.. ఈసారి కూడా తనదైన మార్క్‌తో న్యూ మూవీ పోస్టర్ రిలీజ్ చేశాడు.

‘అన్నం’ టైటిల్.. ‘పరబ్రహ్మ స్వరూపం’ అనే క్యాప్షన్‌తో అనౌన్స్‌ చేసిన ఈ చిత్రం ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. అరిటాకులో అన్నం, రక్తపు మరకలు, కొడవలి, తాళి బొట్టు అన్నీ కలిపి ఉన్న పిక్చర్ సినిమాపై హైప్స్ క్రియేట్ చేస్తుందనే చెప్పాలి. ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే ప్రారంభం కాగా.. ‘మై నెక్స్ట్ ఒక ఎక్స్‌ప్లోజివ్’ అంటూ ట్వీట్ చేశారు కృష్ణవంశీ. త్వరలో మరిన్ని అప్‌డేట్స్‌తో వచ్చేస్తామని ప్రకటించారు. కాగా గవర్నమెంట్, ఫ్రీ స్కీమ్స్, ల్యాండ్ మాఫియా, కాల్ మనీ, వైరస్, బ్యాక్టీరియా, పాలిటిక్స్, పెస్టిసైడ్స్ లాంటి అంశాల మిళితంగా రైతులు, ఫ్యాక్షనిజం నేపథ్యంలో ‘అన్నం’ రాబోతున్నట్లు టైటిల్ పోస్టర్‌ను చూస్తే అర్థం అవుతోంది.

Tags:    

Similar News