డాడీకి నా బాయ్ ఫ్రెండ్స్ నచ్చరు : జాకీష్రాఫ్ కూతురు
దిశ, సినిమా : బాలీవుడ్ యాక్టర్ జాకీష్రాఫ్, తన కూతురు కృష్ణ ష్రాఫ్ కోసం సరైన వ్యక్తిని వెతకడం చాలా కష్టమని అభిప్రాయపడ్డాడు. ఇక తన బాయ్‌ఫ్రెండ్స్ విషయంలో తండ్రి జాకీ రియాక్షన్ ఏంటని? కృష్ణను ప్రశ్నించగా.. ‘నేను ఎవరితోనైనా కలిసి తిరిగితే నాన్న ఇష్టపడతాడని అనుకోను. అందుకు తనను నిందించడం లేదు కూడా. ఎందుకంటే ఆయన ఎప్పుడూ కరెక్ట్‌గానే ఉంటారు’ అని చెప్పింది. ఈ మేరకు తండ్రీకూతుళ్లు తమ తాజా ఇంటర్వ్యూలో మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు […]
దిశ, సినిమా : బాలీవుడ్ యాక్టర్ జాకీష్రాఫ్, తన కూతురు కృష్ణ ష్రాఫ్ కోసం సరైన వ్యక్తిని వెతకడం చాలా కష్టమని అభిప్రాయపడ్డాడు. ఇక తన బాయ్‌ఫ్రెండ్స్ విషయంలో తండ్రి జాకీ రియాక్షన్ ఏంటని? కృష్ణను ప్రశ్నించగా.. ‘నేను ఎవరితోనైనా కలిసి తిరిగితే నాన్న ఇష్టపడతాడని అనుకోను. అందుకు తనను నిందించడం లేదు కూడా. ఎందుకంటే ఆయన ఎప్పుడూ కరెక్ట్‌గానే ఉంటారు’ అని చెప్పింది. ఈ మేరకు తండ్రీకూతుళ్లు తమ తాజా ఇంటర్వ్యూలో మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు.
ఈ క్రమంలో తన కూతురు ఎవరిని ఇష్టపడ్డా, ప్రేమించినా ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తానన్న జాకీ.. ఒక తండ్రిగా తన ప్రిన్సెస్‌కు తగ్గ వ్యక్తిని సెలెక్ట్ చేయడం కష్టమైన పనే అన్నాడు. అంటే మీ కూతురిని బయటకు పంపేందుకు భయపడుతున్నారా? అన్న ప్రశ్నకు.. నచ్చిన వ్యక్తిని ఎంచుకునే స్వేచ్ఛ తనకు ఉందని, అతనితో జీవితాంతం గడపాల్సింది తనే గానీ పేరెంట్స్ కాదని జవాబిచ్చారు. అంతేకాదు తన పిల్లలు టైగర్, కృష్ణ ముక్కుసూటి మనస్థత్వం గలవారని చెప్పుకొచ్చాడు.