నిక్కర్ సరిపోవట్లేదని పోలీసులకు ఫిర్యాదు
దిశ, వెబ్ డెస్క్: టైలర్ తనకు సరిపడా నిక్కర్ కుట్టలేదని ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌లో శనివారం వెలుగులోకి వచ్చింది. కృష్ణకుమార్ దుబే అనే వ్యక్తి ఇటీవల 2మీట్లర పొడవున్న వస్ర్తంతో తనకు నిక్కర్ కుట్టాలని టైలర్ వద్దకు వెళ్లాడు. అయితే, సైజు బాగా తగ్గించి కుట్టాడని.. వేసుకుంటే సరిపోవడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిక్కర్ కుట్టు కూలికి రూ.70చెల్లించానని…తిరిగి దానిని సరిచేసి ఇవ్వమన్నా అతను స్పందించడం […]
దిశ, వెబ్ డెస్క్: టైలర్ తనకు సరిపడా నిక్కర్ కుట్టలేదని ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌లో శనివారం వెలుగులోకి వచ్చింది. కృష్ణకుమార్ దుబే అనే వ్యక్తి ఇటీవల 2మీట్లర పొడవున్న వస్ర్తంతో తనకు నిక్కర్ కుట్టాలని టైలర్ వద్దకు వెళ్లాడు. అయితే, సైజు బాగా తగ్గించి కుట్టాడని.. వేసుకుంటే సరిపోవడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిక్కర్ కుట్టు కూలికి రూ.70చెల్లించానని…తిరిగి దానిని సరిచేసి ఇవ్వమన్నా అతను స్పందించడం లేదని దుబే ఆవేదన వ్యక్తం చేశాడు.ఈ విషయం పై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడం.. అది కాస్త బయటకు తెలియడంతో వైరల్‌గా మారింది.