కొవిడ్-19 కంట్రోల్‌ రూమ్‌ పరిశీలన

దిశ, న్యూస్‌బ్యూరో: హైదరాబాద్‌లో పర్యటిస్తున్న కేంద్రబృందం మంగళవారం జీహెచ్ఎంసీ కార్యాలయంలోని కొవిడ్- 19 కంట్రోల్ రూమ్‌ను పరిశీలించింది. ఇదే క్రమంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అధికారులకు ఫోన్ చేసి కేంద్రబృందం మాట్లాడింది. ఈ సందర్భంగా కంట్రోల్ రూమ్ విధులపై ఓఎస్డీ అనురాధ కేంద్ర బృందానికి వివరించారు. వలస కార్మికులకు సదుపాయాలు, కంట్రోల్ రూమ్‌కు వస్తున్న కాల్స్, అన్నపూర్ణ మొబైల్ కేంద్రాల నిర్వహణ, శాఖల సమన్వయంపై కేంద్ర బృందం ఆరా తీసింది. అత్యవసర సేవలకు 32అంబులెన్స్‌లను కార్యాలయంలో అందుబాటులో ఉంచినట్లు […]

Update: 2020-04-28 08:17 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: హైదరాబాద్‌లో పర్యటిస్తున్న కేంద్రబృందం మంగళవారం జీహెచ్ఎంసీ కార్యాలయంలోని కొవిడ్- 19 కంట్రోల్ రూమ్‌ను పరిశీలించింది. ఇదే క్రమంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అధికారులకు ఫోన్ చేసి కేంద్రబృందం మాట్లాడింది. ఈ సందర్భంగా కంట్రోల్ రూమ్ విధులపై ఓఎస్డీ అనురాధ కేంద్ర బృందానికి వివరించారు. వలస కార్మికులకు సదుపాయాలు, కంట్రోల్ రూమ్‌కు వస్తున్న కాల్స్, అన్నపూర్ణ మొబైల్ కేంద్రాల నిర్వహణ, శాఖల సమన్వయంపై కేంద్ర బృందం ఆరా తీసింది. అత్యవసర సేవలకు 32అంబులెన్స్‌లను కార్యాలయంలో అందుబాటులో ఉంచినట్లు జోనల్ కమిషనర్ తెలిపారు. హెల్ప్ లైన్ నెంబర్ 040-2111 11 11 కు వచ్చిన ప్రతి కాల్‌ను రిజిస్టర్‌లో నమోదుచేసి స్పందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ బృందంలో కేంద్ర ప్ర‌జారోగ్య‌శాఖ సీనియ‌ర్ వైద్యులు చంద్ర‌శేఖ‌ర్ గెడం, జాతీయ పోష‌కాహార సంస్థ డైరెక్ట‌ర్ హేమ‌ల‌త‌, వినియోగ‌దారుల వ్య‌వ‌హారాల శాఖ డైరెక్ట‌ర్ ఎస్‌ఎస్‌. ఠాకూర్‌, జాతీయ విప‌త్తు నివార‌ణ సంస్థ అసోసియేట్ ప్రొఫెస‌ర్ శేఖ‌ర్ చ‌తుర్వేది ఉన్నారు.

Tags: GHMC, Central Team, control Room

Tags:    

Similar News