అడ్డంగా బుక్కైన కౌశిక్ రెడ్డి.. మరో ఆడియో హల్‌చల్
దిశ ప్రతినిధి, కరీంగనర్: కాంగ్రెస్ బహిష్కృత నేత కౌశిక్ రెడ్డి వ్యవహారం ప్రస్తుతం టీ పాలిటిక్స్‌లో కలకలం రేపుతోంది. కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురై ఆయన.. ఈ నెల 16న గూలాబీ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. 14న కేటీఆర్ చేతుల మీదుగా తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకోనుండగా.. 16న సీఎం కేసీఆర్ సమక్షంలో ఎల్. రమణతో పాటు గులాబీ కండువా కప్పుకోనున్నారు. అయితే రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం […]
దిశ ప్రతినిధి, కరీంగనర్: కాంగ్రెస్ బహిష్కృత నేత కౌశిక్ రెడ్డి వ్యవహారం ప్రస్తుతం టీ పాలిటిక్స్‌లో కలకలం రేపుతోంది. కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురై ఆయన.. ఈ నెల 16న గూలాబీ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. 14న కేటీఆర్ చేతుల మీదుగా తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకోనుండగా.. 16న సీఎం కేసీఆర్ సమక్షంలో ఎల్. రమణతో పాటు గులాబీ కండువా కప్పుకోనున్నారు. అయితే రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్‌లపై కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నారు. కౌశిక్ రెడ్డి నోరు అదుపులో ఉంచుకుని మాట్లాడాలని హెచ్చరిస్తున్నారు. కేసీఆర్ అండతోనే కౌశిక్ రెడ్డి నోరు జారి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
తాను టీఆర్‌ఎస్ పార్టీలో చేరి హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు కాంగ్రెస్ నుంచి వెళ్లి బీజేపీలో చేరిన ఒక నేతతో కౌశిక్ రెడ్డి మాట్లాడిన ఆడియో కాల్ ఇటీవల దుమారం రేగింది. దీంతో ఆడియో కాల్ వ్యవహారంపై వివరణ ఇవ్వాల్సిందిగా కౌశిక్ రెడ్డికి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనిపై అసంతృప్తికి గురైన కౌశిక్ రెడ్డి.. కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నానని, కేసీఆర్ తనకే టికెట్ ఇస్తారంటూ కౌశిక్ రెడ్డి బహిరంగంగా చెబుతున్నారు.
ఈ క్రమంలో తాజాగా కౌశిక్ రెడ్డికి సంబంధించిన మరో ఆడియో కాల్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ నెల 16న టీఆర్‌ఎస్ పార్టీలో చేరనున్న క్రమంలో తన వెంట మరికొంత మంది కాంగ్రెస్ నేతలను తీసుకెళ్లే పనిలో కౌశిక్ రెడ్డి బిజీబిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులకు ఫోన్‌లు చేస్తున్నారు. టీఆర్‌ఎస్ తరపున పోటీ చేస్తున్నానని, తనకు ఉపఎన్నికలో మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. నేరుగా తాను వచ్చి మిమ్మల్ని కలుస్తానంటూ కాంగ్రెస్ నేతలకు ఫోన్‌లు చేస్తున్నారు. తాజాగా హుజురాబాద్ మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన తిరుపతితో చేసిన ఫోన్ కాల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఆ ఆడియో కాల్ వినేందుకు క్రింద క్లిక్ చేయండి.