రూ.4 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను దాటిన కోటక్ బ్యాంకు

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల రూ. 4 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను దాటిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తర్వాత దేశీయ ప్రైవేట్ దిగ్గజ కోటక్ మహీంద్రా బ్యాంక్ బుధవారం మొదటిసారిగా రూ. 4 లక్షల మార్కెట్ క్యాప్‌ను అందుకుంది. బుధవారం స్టాక్ మార్కెట్లో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్ ధర రూ. 2,018 వద్ద ట్రేడయింది. దీంతో రూ. 4 లక్షల మార్కెట్ క్యాప్‌ను అందుకున్న ఎండోప్రైవేట్ రంగ బ్యాంకుగా నిలిచింది. గడిచిన ఐదు రోజుల్లో బ్యాంకు స్టాక్ […]

Update: 2020-12-30 09:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల రూ. 4 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను దాటిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తర్వాత దేశీయ ప్రైవేట్ దిగ్గజ కోటక్ మహీంద్రా బ్యాంక్ బుధవారం మొదటిసారిగా రూ. 4 లక్షల మార్కెట్ క్యాప్‌ను అందుకుంది. బుధవారం స్టాక్ మార్కెట్లో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్ ధర రూ. 2,018 వద్ద ట్రేడయింది. దీంతో రూ. 4 లక్షల మార్కెట్ క్యాప్‌ను అందుకున్న ఎండోప్రైవేట్ రంగ బ్యాంకుగా నిలిచింది. గడిచిన ఐదు రోజుల్లో బ్యాంకు స్టాక్ ధర 6.14 శాతం వృద్ధి సాధించింది. అలాగే, వార్షిక ప్రాతిపదికన దాదాపు 20 శాతం పెరగ్గా, ఈ ఏడాదిలో 20.24 శాతం పెరిగింది.

కేవలం నెల రోజుల వ్యవధిలో 6.51 శాతం పెరగడంతో కోటక్ మహీంద్రా బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ. 14.01 లక్షల కోట్లకు పెరిగింది. గత రెండు దశాబ్దాల కాలంలో కోటక్ బ్యాంక్ అత్యంత స్థిరమైన సంపద సృష్టికర్తగా ఉందని మోతీలాల్ ఓస్వాల్ అభిప్రాయపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో కోటక్ బ్యాంకు బలమైన ఆదాయాన్ని వెల్లడించింది. ఈ త్రైమాసికంలో బ్యాంకు నికర లాభం 26.7 శాతం పెరిగి రూ. 2,184.48 కోట్లుగా నమోదు చేసింది. అలాగే, స్వతంత్ర ఆదాయం రూ. 8,288.08 కోట్లకు పెరిగింది. సెప్టెంబర్ 30 నాటికి బ్యాంకు నికర ఎన్‌పీఏలు 0.64 శాతానికి తగ్గింది.

Tags:    

Similar News