ఆనందయ్య ఆయుర్వేద మెడిసిన్ రియాక్షన్.. విషమంగా కోటయ్య ఆరోగ్యం
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనా వ్యాధి నివారణకు ఆనందయ్య అనే వ్యక్తి ఆయుర్వేద వైద్యం ద్వారా పసరు మందు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసి చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు నిన్న భారీ ఎత్తున కృష్ణ పట్నానికి చేరుకున్నారు. అయితే, ఆనందయ్య దగ్గర పసరు మందు తీసుకున్న కోటయ్య అనే వ్యక్తికి కంటి సమస్య ఏర్పడింది. రెండ్రోజుల కిందట రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్యకు ఆక్సిజన్ లెవల్స్ తగ్గడంతో […]
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనా వ్యాధి నివారణకు ఆనందయ్య అనే వ్యక్తి ఆయుర్వేద వైద్యం ద్వారా పసరు మందు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసి చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు నిన్న భారీ ఎత్తున కృష్ణ పట్నానికి చేరుకున్నారు. అయితే, ఆనందయ్య దగ్గర పసరు మందు తీసుకున్న కోటయ్య అనే వ్యక్తికి కంటి సమస్య ఏర్పడింది. రెండ్రోజుల కిందట రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్యకు ఆక్సిజన్ లెవల్స్ తగ్గడంతో ఆనందయ్య దగ్గర పసరు మందు తీసుకున్నాడు. ఆ తర్వాత అతని ఆరోగ్యం మెరుగుపడింది.
అయితే, ఉన్నట్టుండి మళ్లీ కోటయ్య ఆరోగ్యం క్షీణించడంతో ఆక్సిజన్ లెవల్స్ పడిపోయాయి. వెంటనే అతన్ని నెల్లూరు పట్టణ ఆస్పత్రిలో చేర్పించారు. పరిక్షించిన వైద్యులు పసరు మందు కొందరిలో పనిచేయడం లేదని, ఆరోగ్యం క్షీణిస్తోందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం కోటయ్యలో టాక్సిక్ కెరటైటిస్ వ్యాధి లక్షణాలు మొదలైనట్లు గుర్తించారు. పసరులో జిల్లెడు పాలు వాడినట్లు అయితే కంటి నరాలు దెబ్బతినే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఇదిలాఉండగా, ప్రస్తుతం ఆనందయ్య ఆయుర్వేద మందును ఐసీఎంఆర్, ఆయూష్ విభాగం వారు పరీక్షిస్తున్నారు. మందు వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటేనే కరోనా నివారణకు దీనిని అనుమతించనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.