చిరు ‘టెంపుల్ సెట్’

మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ చిత్రం షూటింగ్ ఆగస్ట్ నుంచి ప్రారంభం కానుందని ఫిల్మ్ నగర్ టాక్. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా దేవాదాయ భూముల ఆక్రమణ నేపథ్యంలో ఉండబోతోంది. దేవాదాయ శాఖ ఉద్యోగి పాత్రలో కనిపించబోతున్న చిరు.. అవినీతిని ఎలా అడ్డుకున్నాడనేది సినిమా కథ. కాగా, ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఇంటెన్సివ్ రోల్‌లో కనిపించబోతున్నారు. స్టూడెంట్ లీడర్ లేదా నక్సలైట్ పాత్రలో నటించనున్నట్లు సమాచారం. అయితే, ఇప్పటికే 40 శాతం షూటింగ్ […]

Update: 2020-07-21 02:43 GMT

మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ చిత్రం షూటింగ్ ఆగస్ట్ నుంచి ప్రారంభం కానుందని ఫిల్మ్ నగర్ టాక్. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా దేవాదాయ భూముల ఆక్రమణ నేపథ్యంలో ఉండబోతోంది. దేవాదాయ శాఖ ఉద్యోగి పాత్రలో కనిపించబోతున్న చిరు.. అవినీతిని ఎలా అడ్డుకున్నాడనేది సినిమా కథ. కాగా, ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఇంటెన్సివ్ రోల్‌లో కనిపించబోతున్నారు. స్టూడెంట్ లీడర్ లేదా నక్సలైట్ పాత్రలో నటించనున్నట్లు సమాచారం.

అయితే, ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కోసం టెంపుల్ సెట్ వేయించాలని అనుకుంటున్నారట కొరటాల. దేవాదాయ శాఖ ఉద్యోగిగా చిరుపై ఈ సన్నివేశాల చిత్రీకరణ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ముందుగా ఏదైనా పురాణ ఆలయంలో షూటింగ్ జరపాలని అనుకున్నా.. ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితుల కారణంగా స్పెషల్ సెట్ వేయిస్తున్నారని తెలుస్తోంది.

Tags:    

Similar News