ఐదోసారి జతకట్టనున్న స్టార్ జోడి.. ఫ్యాన్స్‌కు పండగే
దిశ, సినిమా: ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్‌లో మరో ప్రాజెక్ట్ రాబోతున్న విషయం తెలిసిందే. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ మూవీ స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీలో తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ నటించనున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో చర్చ నడిచింది. కానీ తాజాగా ఆమెను కాదని స్టార్ నటి సమంత వైపు దర్శకుడు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ముందుగా నలుగురు […]
దిశ, సినిమా: ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్‌లో మరో ప్రాజెక్ట్ రాబోతున్న విషయం తెలిసిందే. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ మూవీ స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీలో తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ నటించనున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో చర్చ నడిచింది. కానీ తాజాగా ఆమెను కాదని స్టార్ నటి సమంత వైపు దర్శకుడు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ముందుగా నలుగురు హీరోయిన్ల పేర్లు ఎంచుకున్న కొరటాల చివరకు సమంత అయితేనే పాత్రకు న్యాయం చేస్తుందని.. తననే ఫైనల్ చేయాలనుకుంటున్నాడని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇక తారక్-సామ్ జోడి కుదిరితే.. వీరిద్దరూ జతకట్టడం ఇది ఐదోసారి అవుతుంది.