దేశీయ మైక్రోబ్లాగ్ 'కూ'లో భారీ పెట్టుబడులు!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ మైక్రో బ్లాగింగ్ సైట్ ‘కూ’ భారీగా నిధులను రాబడుతోంది. సిరీస్ బీ ఫండింగ్‌లో ఇప్పటివరకు 30 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 210 కోట్ల) నిధులను సమీకరించినట్టు తెలుస్తోంది. ఇందులో అధికంగా టైగర్ గ్లోబల్ సంస్థ పెట్టుబడులు అధికంగా ఉన్నాయి. అలాగే, యాక్సెల్ పార్ట్‌నర్స్, బ్లూమ్ వెంచర్స్ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. వీటితో పాటు మిరె అసెట్స్, ఐఐఎఫ్ఎల్ సంస్థలు కొత్తగా పెట్టుబడులు పెట్టాయి. ఈ క్రమంలో ‘కూ’ సంస్థ విలువ 100 […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ మైక్రో బ్లాగింగ్ సైట్ ‘కూ’ భారీగా నిధులను రాబడుతోంది. సిరీస్ బీ ఫండింగ్‌లో ఇప్పటివరకు 30 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 210 కోట్ల) నిధులను సమీకరించినట్టు తెలుస్తోంది. ఇందులో అధికంగా టైగర్ గ్లోబల్ సంస్థ పెట్టుబడులు అధికంగా ఉన్నాయి. అలాగే, యాక్సెల్ పార్ట్‌నర్స్, బ్లూమ్ వెంచర్స్ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. వీటితో పాటు మిరె అసెట్స్, ఐఐఎఫ్ఎల్ సంస్థలు కొత్తగా పెట్టుబడులు పెట్టాయి. ఈ క్రమంలో ‘కూ’ సంస్థ విలువ 100 మిలియన్ డాలర్లు(రూ. 727 కోట్లకు) చేరుకుంది.
ఫిబ్రవరిలో ఈ సంస్థ విలువ 25 మిలియన్ డాలర్లుగా ఉంది. కొత్తగా వచ్చిన నిధులను సాంకేతికంగా బలోపేతం చేయడమే కాకుండా, రానున్న కొన్నేళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వేదికంగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్టు’ ‘కూ’ సహ వ్యవస్థాపకుడు, సీఈవో అప్రమేయ రాధాకృష్ణ చెప్పారు.