కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యమాలు మరువలేనివి..!

దిశ, ముషీరాబాద్: హైదరాబాద్ ఆశోక్‎నగర్‎లో ముషీరాబాద్ పద్మశాలి ప్రజాసంఘం ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 105వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ మంత్రి నాయిని నరసింహా రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, టీటీడీపీ నేత ఎల్.రమణలు పాల్గొని ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉద్యమకారులు తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘం అధ్యక్షులు ఏఎల్. మల్లయ్య, బీసీ సంక్షేమ […]

Update: 2020-09-27 09:36 GMT

దిశ, ముషీరాబాద్: హైదరాబాద్ ఆశోక్‎నగర్‎లో ముషీరాబాద్ పద్మశాలి ప్రజాసంఘం ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 105వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ మంత్రి నాయిని నరసింహా రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, టీటీడీపీ నేత ఎల్.రమణలు పాల్గొని ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉద్యమకారులు తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘం అధ్యక్షులు ఏఎల్. మల్లయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్యలను సన్మానించారు.

ఈ సందర్భంగా నాయిని నర్సింహా రెడ్డి మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. వారి ఆశయాలను భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సమాజంలో బీసీలకు న్యాయం జరగాలన్నారు డా.లక్ష్మణ్.

టీడీపీ నేత ఎల్.రమణ మాట్లాడుతూ.. తెలంగాణ సాధన కోసం తన పదవిని త్యాగం చేసిన మహనీయుడు బాపూజీ అని కొనియాడారు. ఆశయాల సాధన కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. నిజాయితీ, నిబద్ధత కలిగిన నాయకుడు బాపూజీ అని ఆర్.కృష్ణయ్య అన్నారు.

Tags:    

Similar News