కోమటిరెడ్డి వర్సెస్ ఎర్రబెల్లి
దిశ, న్యూస్ బ్యూరో: అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో రెండోవ రోజు శనివారం గవర్నర్ ప్రసంగం పై చర్చ జరిగింది.. ప్రతి పక్షాలు గవర్నర్ ప్రసంగం రాష్ట్రంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉందన్నారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్య మంత్రి రాష్ట్రం మొత్తానికి ముఖ్యంమంత్రా లేక కొంత ప్రాంతానికేనా అని వ్యంగస్త్రాలు విసిరాడు. రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు తప్ప మరే ప్రాజెక్టులు కనిపించడం లేవని ఎద్దేవా చేశారు.. పాలమురు ప్రాజెక్టులలో భాగంగా ఉన్న డిండీ […]
దిశ, న్యూస్ బ్యూరో: అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో రెండోవ రోజు శనివారం గవర్నర్ ప్రసంగం పై చర్చ జరిగింది.. ప్రతి పక్షాలు గవర్నర్ ప్రసంగం రాష్ట్రంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉందన్నారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్య మంత్రి రాష్ట్రం మొత్తానికి ముఖ్యంమంత్రా లేక కొంత ప్రాంతానికేనా అని వ్యంగస్త్రాలు విసిరాడు. రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు తప్ప మరే ప్రాజెక్టులు కనిపించడం లేవని ఎద్దేవా చేశారు.. పాలమురు ప్రాజెక్టులలో భాగంగా ఉన్న డిండీ లిఫ్ట్ ఇరిగేషన్ పనులపై ఎందుకు శ్రద్ధ చూపడం లేదని ప్రశ్నించారు. నల్లంగొండ జిల్లా మంచి నీళ్లు లేక ఫ్లోరైడ్‌తో బాధపడుతుందన్నారు.
రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై జోక్యం చేసుకున్న మంత్రి ఎర్రెబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. రాష్ట్రంలో మారుమూల జిల్లాలకు సాగు నీరు అందిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును తక్కువ చేసిన మాట్లాడటం బాధకరంగా ఉందన్నారు. బీడు భూములకు సాగు నీరు అందండంతో రైతులు ఆనందంగా ఉన్నారన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు కూడా సాగు నీరు అందుతుందన్నారు.. కాళేశ్వరం గురించి తప్పుగా మాట్లాడితే.. నల్లగొండ జిల్లా ప్రజలు నిన్ను విధుల్లో ఉరికిచ్చి కొడుతారు జాగ్రత అని రాజగోపాల్ రెడ్డిని ఎర్రబెల్లి హెచ్చరించారు.
tag:komatireddy rajagopal reddy, errabelli dayakar rao, comments, assembly