మరోసారి రేవంత్‌పై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ ఖాళీ అయ్యి నాలుగున్నర నెలలు అయిందని, కొత్త పీసీసీ ఎందుకు రివ్యూ చేయట్లేదని ప్రశ్నించారు. పీసీసీ నేతలు హుజూరాబాద్ ఎందుకు వెళ్లరని నిలదీశారు. పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదని, అందరం కలిసి పనిచేస్తే రూ.50 వేల ఓట్లు రావా? అని ప్రశ్నించారు. వారానికి ఒక్కసారి సమావేశాలు పెడితే పార్టీ గెలవదా? అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. జీరోగా ఉన్న దుబ్బాకలో 23 వేల […]

Update: 2021-09-25 07:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ ఖాళీ అయ్యి నాలుగున్నర నెలలు అయిందని, కొత్త పీసీసీ ఎందుకు రివ్యూ చేయట్లేదని ప్రశ్నించారు. పీసీసీ నేతలు హుజూరాబాద్ ఎందుకు వెళ్లరని నిలదీశారు. పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదని, అందరం కలిసి పనిచేస్తే రూ.50 వేల ఓట్లు రావా? అని ప్రశ్నించారు.

వారానికి ఒక్కసారి సమావేశాలు పెడితే పార్టీ గెలవదా? అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. జీరోగా ఉన్న దుబ్బాకలో 23 వేల ఓట్లు తెచ్చుకున్నామని కోమటిరెడ్డి చెప్పారు. పీసీసీ నేతలపై కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్నాయి. రేవంత్ రెడ్డిని ఉద్దేశించే కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేశారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News