డాక్టర్లను తరిమికొడతారా? ఇదేం మానవత్వం…?

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ఎంతో మంది ఈ వ్యాధి బారిన పడి చనిపోగా మరింత మంది బాధపడుతున్నారు. వేగంగా కరోనా వ్యాప్తి చెందుతుండగా ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించి పలు సూచనలు అందించాయి. చాలా మంది వీటిని ఫాలో అవుతున్నా… కొంత మంది మాత్రం నెగ్లెక్ట్ చేస్తున్నారు. దీంతో కొన్ని ఏరియాల్లో ఇంటికే వెళ్లి కోవిడ్ 19 వ్యాధి గురించి అవగాహన కల్పిస్తున్న వైద్య సిబ్బంది… టెస్టులు చేస్తున్నారు. ఇదే […]

Update: 2020-04-02 03:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ఎంతో మంది ఈ వ్యాధి బారిన పడి చనిపోగా మరింత మంది బాధపడుతున్నారు. వేగంగా కరోనా వ్యాప్తి చెందుతుండగా ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించి పలు సూచనలు అందించాయి. చాలా మంది వీటిని ఫాలో అవుతున్నా… కొంత మంది మాత్రం నెగ్లెక్ట్ చేస్తున్నారు. దీంతో కొన్ని ఏరియాల్లో ఇంటికే వెళ్లి కోవిడ్ 19 వ్యాధి గురించి అవగాహన కల్పిస్తున్న వైద్య సిబ్బంది… టెస్టులు చేస్తున్నారు. ఇదే పని మీద మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లోని తట్‌పట్టి బఖల్ ప్రాంతానికి వెళ్లిన డాక్టర్లపై అక్కడి జనం రాళ్లతో దాడి చేశారు. ప్రాణాలకు తెగించి మరీ సేవలందిస్తున్న డాక్టర్ల ప్రాణాలు తీద్దామనుకున్నారు. వారి ప్రాణాలకు ముప్పుందని తెలిసినా.. జనం సంక్షేమం కోసం పరీక్షలు చేసేందుకు వెళ్లిన వారిని తరిమి తరిమి కొట్టారు.

ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు కోలీవుడ్ దర్శకుడు, రచయిత రత్న కుమార్. మానవత్వం ఎక్కడుంది? ఎందుకంత అనాగరికంగా ప్రవర్తిస్తున్నారని ప్రశ్నించాడు. ఈ ఘటనను చూసి గుండె బరువెక్కిందన్న రత్న కుమార్… ఇలాంటివి చూసినప్పుడే మనకు గుణపాఠం నేర్పేందుకు ఈ కరోనా వైరస్‌కు అర్హత ఉందనిపిస్తోందన్నారు.

Tags : Kollywood, Ratnakumar, People, Doctors

Tags:    

Similar News