‘కోల్‌కతాలో ఆ ఇద్దరు చెలరేగిన వేళ’
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 42వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ పూర్వ వైభవాన్ని చాటారు. వరుస విజయాలతో ఊపు మీద ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు కాసింత టెన్షన్ పెట్టారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన KKR జట్టు ఢిల్లీ ముందు భారీ స్కోర్‌ను నిర్దేశించింది. నిర్ణీత 20 ఓవర్లతో 6 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ముఖ్యంగా ఓపెనర్ నితీష్ రానా(81), సునీల్ నరైన్ (64)లతో మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఈ సీజన్ ఢిల్లీతో జరిగిన […]
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 42వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ పూర్వ వైభవాన్ని చాటారు. వరుస విజయాలతో ఊపు మీద ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు కాసింత టెన్షన్ పెట్టారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన KKR జట్టు ఢిల్లీ ముందు భారీ స్కోర్‌ను నిర్దేశించింది. నిర్ణీత 20 ఓవర్లతో 6 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ముఖ్యంగా ఓపెనర్ నితీష్ రానా(81), సునీల్ నరైన్ (64)లతో మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఈ సీజన్ ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 210 పరుగులు చేసి ఓటమి పాలైన కేకేఆర్.. రెండోసారి 194 పరుగుల స్కోరు చేసింది. ఇక ఢిల్లీ ముందు భారీ స్కోర్ (195) ఉండడంతో కావడంతో గెలుచేది ఎవరో అన్న అంశం ఆసక్తిని రేపుతోంది.
ఇన్నింగ్స్ సాగిందిలా…
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ జట్టు తొలుత తడబడింది. కేవలం 11 పరుగుల వద్దనే ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌ను(9) క్యాచ్ అవుట్ అయ్యాడు. అప్పటికే క్రీజులో ఉన్న నితీష్ రానా బాల్ టు బాల్ ఆడుతూ వచ్చాడు. ఇదే సమయంలో వన్‌డౌన్‌లో వచ్చిన రాహుల్ త్రిపాఠి(13) ఔట్ అయ్యాడు. 35 పరుగులకే రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్‌కు.. మిడిలార్డర్లో వచ్చిన దినేష్ కార్తీక్(3) పరుగులు మాత్రమే చేసి 42 స్కోర్ బోర్డు వద్ద పెవిలియన్ చేరాడు. దీంతో 7.2 ఓవర్లకే కేకేఆర్ 3 కీలక వికెట్లను కోల్పోయింది.
సునీల్ నరైన్-నితీష్ రానా బ్యాక్ టు ఫామ్:
ఇక తొలి నుంచి క్రీజులో నిలబడ్డ నితీష్ రానాకు.. హార్డ్ హిట్టర్ సునీల్ నరైన్ బ్యాక్ టు ఫామ్ అంటూ చెలరేగిపోయాడు. దీంతో అప్పటివరకు బాల్ టు బాల్ ఆడిన రానాకు మంచి భాగస్వామ్యం లభించడంతో ఆకాశమే హద్దుగా ఆడారు. కేవలం 32 బంతుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్సర్లతో నరైన్ 64 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇక తొలి నుంచే ఉన్న రానా 53 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్సర్‌తో 81 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. వీరిద్దరు చెలరేగిన వేళ కేకేఆర్ స్కోర్ 200 వైపు దూసుకెళ్లినా.. చివరి నిమిషంలో ఇద్దరు వికెట్ కోల్పోయారు. ఇక 6వ స్థానంలో వచ్చిన మోర్గాన్ (19) పరుగులు చేశాడు. 20 ఓవర్లో చివరి బంతికి షాట్ ఆడబోయిన మోర్గాన్ స్టోయినిస్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో కేకేఆర్ జట్టు 6 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది.
Kolkata Knight Riders Innings: 194-6 (20 Ov)
1. శుబ్‌మన్ గిల్ c అక్సర్ b నొర్జే 9(8)
2. నితీష్ రానా c తుషర్ దేశ్‌పాండే b స్టోయినిస్ 81(53)
3. రాహుల్ త్రిపాఠి b నొర్ట్జే 13(12)
4. దినేష్ కార్తీక్ (wk)c పంత్ b రబాడా 3(6)
5. సునీల్ నరైన్ b రబాడా 64(32)
6. ఇయాన్ మోర్గాన్ c రబాడా b స్టోయినిస్ 17(9)
7. ప్యాట్ కమ్మిన్స్ నాటౌట్ 0(0)
ఎక్స్‌ట్రాలు: 7
మొత్తం స్కోరు: 194-6
వికెట్ల పతనం: 11-1 (శుబ్‌మన్ గిల్, 1.5), 35-2 (రాహుల్ త్రిపాఠి, 5.4), 42-3 (దినేష్ కార్తీక్, 7.2), 157-4 (సునీల్ నరైన్, 16.4), 194-5 (నితీష్ రానా, 19.5), 194-6 (ఇయాన్ మోర్గాన్, 19.6)
బౌలింగ్:
1. తుషర్ దేశ్‌పాండే 4-0-40-0
2. ఎన్రిచ్ నొర్ట్జే 4-0-27-2
3. కగిసో రబాడా 4-0-33-2
4. అక్సర్ పటేల్ 1-0-7-0
5. మార్క్యుస్ స్టోయినిస్ 4-0-41-2
6. రవిచంద్రన్ అశ్విన్ 3-0-45-0