వారే కావాలని కోహ్లీని బలిపశువును చేస్తున్నారా..?

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా కెప్టెన్, స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీని బీసీసీఐ అర్ధాంతరంగా వన్డే కెప్టెన్సీ నుండి తొలగించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ విషయంపై క్రికెట్ అభిమానులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కోహ్లీని కావాలనే బీసీసీఐలో ముంబైకి చెందిన ఒక వర్గం పక్కకు తప్పించే ప్రయత్నం చేస్తుందని అభిమానులు అంటున్నారు. కేవలం కోహ్లీ ఐసీసీ ట్రోఫి గెలవలేదనే కారణంగా కెప్టెన్సీ నుండి తప్పించడం సరికాదంటున్నారు. ఐసీసీ నిర్వహించిన టోర్నిలో ఒకసారి కోహ్లీ చేసిన […]

Update: 2021-12-15 07:54 GMT

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా కెప్టెన్, స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీని బీసీసీఐ అర్ధాంతరంగా వన్డే కెప్టెన్సీ నుండి తొలగించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ విషయంపై క్రికెట్ అభిమానులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కోహ్లీని కావాలనే బీసీసీఐలో ముంబైకి చెందిన ఒక వర్గం పక్కకు తప్పించే ప్రయత్నం చేస్తుందని అభిమానులు అంటున్నారు. కేవలం కోహ్లీ ఐసీసీ ట్రోఫి గెలవలేదనే కారణంగా కెప్టెన్సీ నుండి తప్పించడం సరికాదంటున్నారు. ఐసీసీ నిర్వహించిన టోర్నిలో ఒకసారి కోహ్లీ చేసిన పరుగులు చూడాలని అభిమానులు కోరుతున్నారు. అలాగే ఐసీసీ టోర్నిల్లో కోహ్లీ, రోహిత్ చేసిన పరుగులు చూడాలంటూ వారు చేసిన పరుగుల జాబితాను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. జట్టులో ఉన్న ఆటగాళ్ల చాలా మంది ఐసీసీ టోర్నిల్లో ఒత్తిడికి తట్టుకోలేక విఫలం అవుతున్న విషయం తెలిసిందే.

దానికి కోహ్లీని ఒక్కడినే బాధ్యున్ని చేయడం కరెక్ట్ కాదంటున్నారు. కోహ్లీ ఇండియాకు ఎంతో మంది కెప్టెన్‌ల వల్ల కానీ గొప్ప విజయాలనందిచాడు. అవేమి దృష్టిలో పెట్టుకోకుండా కేవలం రాజకీయాల కోసం కోహ్లీని అలా అవమానించడం మంచి పద్దతి కాదని అభిమానులు విమర్శిస్తున్నారు. అసలు జే షాకు బీసీసీఐలో ఉండేందుకు హోం మంత్రి అమిత్ షా కుమారుడు అనే అర్హత తప్ప.. ఇంకా ఏమైనా ఉన్నాయా అని వారు ప్రశ్నిస్తున్నారు. గంగూలీ, జై షా కలిసి టీమిండియాలో రాజకీయాలు చేసి ఆటగాళ్ల భవిష్యత్‌ను నాశనం చేస్తున్నారని అభిమానులు సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు.

Tags:    

Similar News