కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం.. రెండుసార్లు తెగిన చెక్‌డ్యామ్
దిశ, హుస్నాబాద్: చెక్ డ్యామ్ రెండుసార్లు తెగిపోయినా.. ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ పట్టించుకోవడం లేదని కొహెడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాజుల వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం ఆయన చెక్‌డ్యామ్‌ను సందర్శించి మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లా కొహెడ మండలం కూరెళ్ల గ్రామ సమీపంలోని మోయ తుమ్మెదవాగుపై చెక్ డ్యామ్ నిర్మించారన్నారు. చెక్ డ్యామ్ పనుల నాణ్యత ప్రమాణాలను పర్యవేక్షించాల్సిన అధికారులు, కాంట్రాక్టర్లు ఇస్తున్న మామూళ్ల మత్తులో తూగుతూ నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. అధికారుల […]
దిశ, హుస్నాబాద్: చెక్ డ్యామ్ రెండుసార్లు తెగిపోయినా.. ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ పట్టించుకోవడం లేదని కొహెడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాజుల వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం ఆయన చెక్‌డ్యామ్‌ను సందర్శించి మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లా కొహెడ మండలం కూరెళ్ల గ్రామ సమీపంలోని మోయ తుమ్మెదవాగుపై చెక్ డ్యామ్ నిర్మించారన్నారు. చెక్ డ్యామ్ పనుల నాణ్యత ప్రమాణాలను పర్యవేక్షించాల్సిన అధికారులు, కాంట్రాక్టర్లు ఇస్తున్న మామూళ్ల మత్తులో తూగుతూ నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు.
అధికారుల నిర్లక్ష్యానికి రూ.లక్షల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన చెక్‌డ్యామ్ ఇటీవల కూరిసిన భారీ వర్షాలకు పూర్తిగా ధ్వంసంమైందన్నారు. స్థానిక ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ నిర్మాణ పనులను చేపట్టిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకున్న పాపానపోలేదన్నారు. ఇప్పటికైనా.. ఎమ్మెల్యే స్పందించి, తెగిన చెక్ డ్యామ్‌ను పూర్తి చేయాలని, లేకపోతే రైతులతో కలిసి కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు దూరం శ్రీనివాస్ గౌడ్, కొహెడ మండల యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆవుల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.