ప్రాంతీయ దినపత్రికలకు అండగా ఉంటాం: ప్రోఫెసర్ కోదండరాం
దిశ, ఖైరతాబాద్ : ప్రాంతీయ దినపత్రికలకు అండగా ఉంటాం అని తెలంగాణ జన సమితి ప్రోఫెసర్ కోదండరాం హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పత్రికలను, జర్నలిస్టులను ప్రభుత్వం వేధిస్తుందన్నారు. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని, తెలంగాణలో స్వేచ్ఛా వాయువులు పీల్చాలంటే, ప్రజల కడగండ్లు తొలగిపోవాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. రాష్ట్రంలో ఉన్న పత్రికలు, జర్నలిస్టుల సమస్యలపై చిన్న పత్రికల సంఘం, […]
దిశ, ఖైరతాబాద్ : ప్రాంతీయ దినపత్రికలకు అండగా ఉంటాం అని తెలంగాణ జన సమితి ప్రోఫెసర్ కోదండరాం హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పత్రికలను, జర్నలిస్టులను ప్రభుత్వం వేధిస్తుందన్నారు. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని, తెలంగాణలో స్వేచ్ఛా వాయువులు పీల్చాలంటే, ప్రజల కడగండ్లు తొలగిపోవాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. రాష్ట్రంలో ఉన్న పత్రికలు, జర్నలిస్టుల సమస్యలపై చిన్న పత్రికల సంఘం, తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ల ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, టీపీసీసీ అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్య రెడ్డి, చిన్న పత్రికల సంఘం అధ్యక్షుడు మహ్మద్ యూసుఫ్ బాబు, పలువురు నాయకులు మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణను భవిష్యత్తు లేని తెలంగాణగా కేసీఆర్ మారుస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో పత్రికా స్వేచ్ఛను కాపాడుకోవడానికి జర్నలిస్టులు, ప్రజా సంఘాలు మరోసారి ప్రజా పోరాటం చేసి తెలంగాణను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ జర్నలిస్టు యూనియన్ అధ్యక్షుడు కొప్పుర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి చిన్న పత్రికల సంపాదకులతో పాటు వివిధ సంఘాల నాయకులు పాల్గొని ప్రభుత్వంపై పోరాటం చేసే వారు అందరం ఏకమై ప్రజాస్వామ్యాన్ని పత్రికా స్వేచ్ఛను కాపాడుకోవాలని సూచించారు.