అమరావతి రైతులతో చర్చకు సిద్ధం: కొడాలి నాని

దిశ, వెబ్‌డెస్క్: మున్సిపల్ ఎన్నికల్లో అమరావతి పరిధిలోని గుంటూరు, విజయవాడ కార్పొరేషన్లను వైసీపీ గెలుచుకోడం పట్ల మంత్రి కొడాని నాని ఆనందం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన నాని.. అమరావతి రైతులతో ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని, అమరావతి ప్రాంత అభివృద్ధికి ఏం కావాలనే అజెండాను సిద్ధం చేసుకుని రైతులు ముందుకొస్తే చర్చలకు సిద్ధమని ప్రకటించారు. అమరావతి రైతులు ఆశించిన దాని కంటే సీఎం జగన్ ఎక్కువే ఇస్తారని వ్యాఖ్యానించారు. అమరావతి రైతులను అడ్డు […]

Update: 2021-03-14 09:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: మున్సిపల్ ఎన్నికల్లో అమరావతి పరిధిలోని గుంటూరు, విజయవాడ కార్పొరేషన్లను వైసీపీ గెలుచుకోడం పట్ల మంత్రి కొడాని నాని ఆనందం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన నాని.. అమరావతి రైతులతో ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని, అమరావతి ప్రాంత అభివృద్ధికి ఏం కావాలనే అజెండాను సిద్ధం చేసుకుని రైతులు ముందుకొస్తే చర్చలకు సిద్ధమని ప్రకటించారు.

అమరావతి రైతులు ఆశించిన దాని కంటే సీఎం జగన్ ఎక్కువే ఇస్తారని వ్యాఖ్యానించారు. అమరావతి రైతులను అడ్డు పెట్టుకుని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని, రైతులు ప్రభుత్వంతో చర్చిస్తే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. సీఎం జగన్‌కు కులాలు, మతాలు లేవని నాని వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News