అనంతగిరిలో కోదాడ సీఐ.. చెబుతానని హామీ

దిశా, కోదాడ: గత కొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు పెద్ద చెరువులు, కుంటలు పూర్తిగా నిండి అలుగు పోస్తుండడంతో పలు గ్రామాల్లో రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం పరిధిలోని ఖనాపురం నుండి అనంతగిరి వెళ్ళే రహదారి పై నుండి నీళ్ళు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కోదాడ మండలం పరిధిల అనేక గ్రామాల ప్రజలు అనంతగిరి మండల కేంద్రానికి చేరుకోవాలంటే ఇదే ప్రధాన రహదారి కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు […]

Update: 2020-08-16 02:01 GMT

దిశా, కోదాడ: గత కొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు పెద్ద చెరువులు, కుంటలు పూర్తిగా నిండి అలుగు పోస్తుండడంతో పలు గ్రామాల్లో రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం పరిధిలోని ఖనాపురం నుండి అనంతగిరి వెళ్ళే రహదారి పై నుండి నీళ్ళు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

కోదాడ మండలం పరిధిల అనేక గ్రామాల ప్రజలు అనంతగిరి మండల కేంద్రానికి చేరుకోవాలంటే ఇదే ప్రధాన రహదారి కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు చెబుతున్నారు. నిత్యం అనేక వాహనాలు ఈ రహదారిగుండా ప్రయాణిస్తున్నాయని, ఈ రహదారి కోదాడ నుండి అనంతగిరి మండలంలోని పలు గ్రామాలకు ఇదే దారి ఉంది. నిత్యం వేలల్లో ఈ రహదారి గుండా వాహనాలు రాకపోకలు కొనసాగిస్తుంటాయి.

ఈ నేపథ్యంలో అధికారులు స్పందించి బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. చాలా రోజుల తరువాత కోదాడ పెద్ద చెరువు అలుగు పోసి వాగు ప్రవహిస్తుండడంతో నీళ్ళలోకి వెళ్తే ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున అక్కడ భద్రతా ఏర్పాట్లు చేయాలని ప్రజలు విన్నవించారు. ఈ నేపథ్యంలో కోదాడ పట్టణ సీఐ శ్రీనివాస్ రెడ్డి అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తామని వివరించారు.

Tags:    

Similar News