‘అమితాబ్’ బాడీగార్డు శాలరీ ఎంతో తెలుసా..

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలోని బడా సెలెబ్రిటీలు బయటకు, ఏదైనా ఫంక్షన్లకు వెళ్లినప్పుడు ప్రజలు, అభిమానుల నుంచి తమను తాము రక్షించుకునేందుకు గాను బాడీగార్డులను నియమించుకుంటున్న విషయం తెలిసిందే. అయితే, ఒక్కో అంగరక్షకుడికి ఏడాదికి వీళ్లు చెల్లిస్తున్న వేతనం రూ.కోట్లలో ఉండటం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. వీరి తీసుకుంటున్న డబ్బులతో పోల్చి చూసినపుడు ప్రముఖ కంపెనీలకు సీఈవోలు‌గా చేస్తున్న వారి వేతనం కూడా తక్కువగా ఉండటం విశేషం. ఒకప్పుడు బాలీవుడ్‌ సెలెబ్రిటీలకు మాత్రమే పరిమితమైన బాడీగార్డుల కల్చర్ […]

Update: 2021-08-26 10:31 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలోని బడా సెలెబ్రిటీలు బయటకు, ఏదైనా ఫంక్షన్లకు వెళ్లినప్పుడు ప్రజలు, అభిమానుల నుంచి తమను తాము రక్షించుకునేందుకు గాను బాడీగార్డులను నియమించుకుంటున్న విషయం తెలిసిందే. అయితే, ఒక్కో అంగరక్షకుడికి ఏడాదికి వీళ్లు చెల్లిస్తున్న వేతనం రూ.కోట్లలో ఉండటం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. వీరి తీసుకుంటున్న డబ్బులతో పోల్చి చూసినపుడు ప్రముఖ కంపెనీలకు సీఈవోలు‌గా చేస్తున్న వారి వేతనం కూడా తక్కువగా ఉండటం విశేషం.

ఒకప్పుడు బాలీవుడ్‌ సెలెబ్రిటీలకు మాత్రమే పరిమితమైన బాడీగార్డుల కల్చర్ ప్రస్తుతం అన్ని సినిమా రంగాలకు విస్తరించింది. జనం ఎక్కువగా ఉన్న సమయంలో ప్రభుత్వ ఇచ్చిన పోలీసు సెక్యూరిటీ సరిపోక కొన్నిసార్లు సెలెబ్రిటీలు చాలా ఇబ్బందులు పడ్డారు. అభిమానులు మీద పడటంతో కొందరు కిందపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సినీ ప్రముఖులు ప్రస్తుతం ప్రైవేట్ బాడీగార్డు కన్‌సల్టెన్సీలను నమ్ముకుంటున్నారు. ఈ బాడీగార్డులు వారికి 24 గంటల పాటు పక్కనే ఉంటూ రక్షణ కల్పిస్తారు. సినిమాలు, ఆడియో ఫంక్షన్లు, విదేశాలకు వెళ్ళినా తోడుంటారు.

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన వ్యక్తిగత బాడీగార్డు జితేంద్ర షిండేకు ఏడాదికి రూ.1.5కోట్లు చెల్లిస్తున్నట్టు సమాచారం. అనగా నెలకు రూ.13లక్షలకు పై మాటే. అయితే, జితేంద్ర షిండేకు బాడీగార్డులను అందించే కన్సల్టెన్సీ కూడా ఉంది. అయినప్పటికీ అయన అమితాబ్ బచ్చన్ వ్యక్తిగత బాడీగార్డుగా ఉండేందుకు సుముఖత వ్యక్తం చేశారు. కాగా, బిగ్ బీతో పాటు మరికొందరు బాలీవుడ్ అగ్రతారలు కూడా భారీ మొత్తంలో తమ బాడీగార్డులకు వేతనాలు చెల్లిస్తున్నారు. అందులో అగ్రహీరోయిన్లు కూడా ఉండటం విశేషం. ఒక్కొక్కరిగా చూస్తే..

1. సల్మాన్ ఖాన్ తన బాడీగార్డు షేరాకు ఏడాదికి రూ.2 కోట్లు,
2. కింగ్ ఖాన్ షారుక్ తన బాడీగార్డు రవిసింగ్‌కు ఏడాదికి రూ.2.7కోట్లు
3. బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ తన అంగరక్షకుడు శ్రేసే తేలెకు ఏడాదికి రూ.1.2కోట్లు
4. మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ తన బాడీగార్డు యువరాజ్ గోరపడేకు ఏడాదికి రూ.2 కోట్లు

5. అనుష్క శర్మ తన బాడీగార్డు సోనుకు ఏడాదికి రూ.1.2 కోట్లు..

6. దీపిక పడుకునే తన బాడీగార్డు జలాల్‌కు రూ.1.2కోట్లు చెల్లిస్తున్నారు. అయితే, సెలెబ్రిటీల బాడీగార్డులు అందుకునే వేతనాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పలు కంపెనీల సీఈవోలు కూడా అందుకోకపోవడం గమనార్హం. ప్రస్తుతం సోషల్ మీడియాలో సెలెబ్రిటీల బాడీగార్డుల వేతనాల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

 

Tags:    

Similar News