టెస్టు సిరీస్‌కు కేఎల్ రాహుల్ దూరం
దిశ, స్పోర్ట్స్ : కీలకమైన సిడ్నీ టెస్టుకు ముందు టీమ్ ఇండియాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మూడో టెస్టులో ఓపెనర్‌గా వస్తాడనుకున్న కేఎల్ రాహుల్ చేతి మణికట్టు గాయంతో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. కేఎల్ రాహుల్ నెట్స్‌లో గాయపడ్డాడని.. అతడి మణికట్టుకు గాయం కావడంతో వెంటనే ఇండియాకు తిరిగి వస్తున్నట్లు బీసీసీఐ గౌరవ అధ్యక్షుడు జైషా ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే గాయం కారణంగా మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్ ఇండియాకు తిరిగి వచ్చారు. పితృత్వ […]
దిశ, స్పోర్ట్స్ : కీలకమైన సిడ్నీ టెస్టుకు ముందు టీమ్ ఇండియాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మూడో టెస్టులో ఓపెనర్‌గా వస్తాడనుకున్న కేఎల్ రాహుల్ చేతి మణికట్టు గాయంతో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. కేఎల్ రాహుల్ నెట్స్‌లో గాయపడ్డాడని.. అతడి మణికట్టుకు గాయం కావడంతో వెంటనే ఇండియాకు తిరిగి వస్తున్నట్లు బీసీసీఐ గౌరవ అధ్యక్షుడు జైషా ఒక ప్రకటన విడుదల చేశారు.
ఇప్పటికే గాయం కారణంగా మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్ ఇండియాకు తిరిగి వచ్చారు. పితృత్వ సెలవులతో కోహ్లీ కూడా జట్టుకు దూరమ్యాడు. దీంతో భారత జట్టు సరైన కూర్పు లేకుండా బరిలోకి దిగాల్సిన పరిస్థితి నెలకొన్నది. కేఎల్ రాహుల్ గాయం తీవ్రంగా ఉండటంతో అతడిని వెంటనే ఇండియాకు పిలిపించారు. మూడు వారాల పాటు రాహుల్ బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీలో ఉండి చికిత్స తీసుకోనున్నట్లు బీసీసీఐ తెలిపింది. కీలకమైన మ్యచ్‌లకు ముందు ఆటగాళ్లు దూరం కావడం టీమ్ ఇండియాకు పెద్ద లోటే అని చెప్పాలి.