కేసీఆర్ మళ్లీ అబద్దాలే చెప్పారు

దిశ, వెబ్ డెస్క్: కేసీఆర్ మళ్లీ అబద్దాలే చెప్పారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గత హామీలనే కేసీఆర్ మళ్లీ చదివి వినిపించారన్నారు. అమలు చేయని హామీలనే టీఆర్ఎస్ మళ్లీ చెప్పిందని తెలిపారు. టీఆర్ఎస్ మేనిఫెస్టో ఆచరణ సాధ్యం కానిదని చెప్పారు. టీఆర్ఎస్ మాటలకు చేతలకు పొంతన ఉండదన్నారు. సెలూన్లు, దోబీ ఘాట్లకు ఉచిత విద్యుత్ అని గతంలోనే చెప్పారని అన్నారు. తాగునీటి గోస తీరుస్తామని ఎన్నిసార్లు చెప్పారో లెక్కలేదన్నారు. ఆరున్నరేండ్లలో […]

Update: 2020-11-23 04:45 GMT

దిశ, వెబ్ డెస్క్: కేసీఆర్ మళ్లీ అబద్దాలే చెప్పారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గత హామీలనే కేసీఆర్ మళ్లీ చదివి వినిపించారన్నారు. అమలు చేయని హామీలనే టీఆర్ఎస్ మళ్లీ చెప్పిందని తెలిపారు. టీఆర్ఎస్ మేనిఫెస్టో ఆచరణ సాధ్యం కానిదని చెప్పారు. టీఆర్ఎస్ మాటలకు చేతలకు పొంతన ఉండదన్నారు.

సెలూన్లు, దోబీ ఘాట్లకు ఉచిత విద్యుత్ అని గతంలోనే చెప్పారని అన్నారు. తాగునీటి గోస తీరుస్తామని ఎన్నిసార్లు చెప్పారో లెక్కలేదన్నారు. ఆరున్నరేండ్లలో వరద నీటి నిర్వహణ పనులు సరిగా చేపట్టలేదన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరం కాదు విషాద నగరంగా చేశారని అన్నారు. హైదరాబాద్ వరదల్లో 40 మంది చనిపోయారని తెలిపారు. పాత నగర ప్రజలను ఓట్లు అడిగే హక్కు తెరాస, మజ్లీస్ కు ఉందా అని ప్రశ్నించారు. ఎంఎంటీస్ విస్తరణ, తక్కువ ధరలకే ప్రయాణం అన్నారని తెలిపారు. ఎంఎంటీఎస్ పనులను రైల్వే చేపడుతుందనీ, అందులో కొంత వాటా రాష్ట్రం ఇస్తుందన్నారు. 2016 నాటి మేనిఫెస్టోలోని అంశాలనే ఇప్పటికీ వరకు అమలు చేయలేదన్నారు

Tags:    

Similar News