థర్డ్ వేవ్‌పై అపోహలు వద్దు: కిషన్ రెడ్డి
దిశ, బేగంపేట: కరోనాపై రాబోయే రోజుల్లో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర సహాయ హోం శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో బుధవారం రామ్ గోపాల్ పేటలో కిషన్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం వైద్య సిబ్బంది ఆశా వర్కర్లకు అంగన్వాడీ వర్కర్లకు నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు. […]
దిశ, బేగంపేట: కరోనాపై రాబోయే రోజుల్లో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర సహాయ హోం శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో బుధవారం రామ్ గోపాల్ పేటలో కిషన్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం వైద్య సిబ్బంది ఆశా వర్కర్లకు అంగన్వాడీ వర్కర్లకు నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు. అనంతరం స్థానిక విలేకర్ల సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. కొంతమంది సోషల్ మీడియాలో అనేక వదంతులు థర్డ్ వేవ్‌పై విస్తృత ప్రచారం చేస్తున్నారని, వాటిని ప్రజలు నమ్మకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు.
ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై స్థానిక ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. వ్యాక్సిన్ తమకు అందలేదని ఎవరూ అందోళన చెందాల్సిన అవసరంలేదని, ప్రతిఒక్కరికి ఉచితంగా డిసెంబర్ నాటికి అందేలా ప్రాథమిక అర్బన్ కేంద్రాలలో ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. డిసెంబర్ నాటికి 200 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు కరోనా మహమ్మారితో ఎంతోమంది కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతోమంది ఉపాధి కోల్పోయారని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి గుర్తు చేశారు. సేవా సంఘటన పేరుతో ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వం 5 కిలోలు బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక, మహంకాళి జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్యాంసుందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పెద్ది రవీందర్, బీజేపీ నేతలు చీర శ్రీకాంత్, రామ్ గోపాల్ పేట డివిజన్ అధ్యక్షులు ఆకుల ప్రతాప్, బిజెపి నాయకులు శ్రీనివాస్, ఆకుల నగేష్, నరేందర్ శ్రావణ్, తదితరులు పాల్గొన్నారు.