రైతుబంధు పేరుతో దొంగజపం
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో రైతు వ్యతిరేక పాలన సాగిస్తున్నారని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ఆరోపించారు. ప్రకతి వైఫరిత్యాలతో నష్టపోతున్న రైతులకు కూడా సాయం చేయడం లేదని విమర్శించారు. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్న పంటల రుణాలకు వడ్డీమాఫీ చేయడం లేదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పంటల బీమా పథకం రద్దు చేశారని, సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను పంపిణీ చేయడం లేదన్నారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు రుణాల మాఫీ అని చెప్పారని, వాటి […]
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో రైతు వ్యతిరేక పాలన సాగిస్తున్నారని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ఆరోపించారు. ప్రకతి వైఫరిత్యాలతో నష్టపోతున్న రైతులకు కూడా సాయం చేయడం లేదని విమర్శించారు. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్న పంటల రుణాలకు వడ్డీమాఫీ చేయడం లేదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పంటల బీమా పథకం రద్దు చేశారని, సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను పంపిణీ చేయడం లేదన్నారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు రుణాల మాఫీ అని చెప్పారని, వాటి ఊసేలేదన్నారు. అధిక వడ్డీ భారంతో ప్రైవేట్ అప్పుల బారిన పడి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, కేవలం రైతుబంధు పేరుతో ప్రభుత్వం దొంగజపం చేస్తుందని, రైతు వ్యతిరేక ప్రభుత్వాలపై పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు.