తెరపైకి మరో పేరు.. హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయనే?

దిశ, వెబ్‌డెస్క్: హుజూరాబాద్ ఉప ఎన్నికపై తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల్లో ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికలను రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రచారంలో భాగంగా పాదయాత్ర చేస్తున్నాడు. టీఆర్ఎస్ అభ్యర్థిగా టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినట్లు ఆ పార్టీ వెల్లడించింది. ఇక, అందరి చూపు కాంగ్రెస్ వైపు పడింది. కాంగ్రెస్ అభ్యర్థిగా […]

Update: 2021-08-13 04:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: హుజూరాబాద్ ఉప ఎన్నికపై తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల్లో ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికలను రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రచారంలో భాగంగా పాదయాత్ర చేస్తున్నాడు. టీఆర్ఎస్ అభ్యర్థిగా టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినట్లు ఆ పార్టీ వెల్లడించింది.

ఇక, అందరి చూపు కాంగ్రెస్ వైపు పడింది. కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు బరిలో ఉంటారని తీవ్ర ఆసక్తి నెలకొంది. టీపీసీసీ చీఫ్‌గా మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి నియామకంతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా, సమర్థవంతమైన నాయకుడు లేక కాంగ్రెస్ ఓటములను చవిచూసింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డిలాంటి డైనమిక్ లీడర్‌ను పార్టీ నియమించడంతో కాస్త పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ ఉప ఎన్నికల నుంచే కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి రేవంత్ రెడ్డి కసరత్తు ప్రారంభించారు. దీంతో హుజూరాబాద్ అభ్యర్థిగా రెడ్డి సామాజిక వర్గానికే టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం కిసాన్ సెల్ నాయకులు పత్తి కృష్ణారెడ్డి పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటివరకూ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కొండా సురేఖ బరిలో ఉండనుందని ప్రచారం జరిగిన విషయం తెలిసిదే. దీనిపై అధిష్టానం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Tags:    

Similar News